Begin typing your search above and press return to search.

జపాన్ స్థానం చెక్కు చెదర్లేదు.. మనది మాత్రం 8 ర్యాంకులు పడిపోయింది

By:  Tupaki Desk   |   25 May 2022 4:26 AM GMT
జపాన్ స్థానం చెక్కు చెదర్లేదు.. మనది మాత్రం 8 ర్యాంకులు పడిపోయింది
X
కొన్నింటి గురించి తెలిసినంతనే ఆనందించాలో.. బాధ పడాలో అర్థం కానట్లుగా ఉంటుంది. ఇప్పుడు అలాంటిదే మీతో షేర్ చేసుకుంటున్నది. కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకానికి ఎంతలా దెబ్బడిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

మహమ్మారి కారణంగా అతిధ్య రంగానికి జరిగిన నష్టం అంతా ఇంతా కాదు. కరోనా అనంతర పరిస్థితులు బాగానే ఉన్నా.. జరిగిన నష్టం తాలుకూ గురుతులు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా ప్రపంచ ఆర్థిక వేదిక విడుదల చేసిన అంతర్జాతీయ ప్రయాణ.. పర్యాటకాభివృద్ధి సూచీని విడుదల చేశారు.

ఇందులో భారత్ స్థానం 54. దక్షిణాసియాలో చూస్తే.. జపాన్ అగ్రస్థానంలో ఉంది. ఆసక్తికరమైన విషయం ఏమంటే కరోనాకు ముందు తర్వాత కూడా జపాన్ కు అగ్రస్థానం లభిస్తే.. భారత్ కు మాత్రం ఏకంగా ఎనిమిది ర్యాంకులు దెబ్బడిపోయింది.


చాలా దేశాలతో పోలిస్తే మన ర్యాంకు పడిపోవటం తక్కువనే మాట చెబుతున్నా.. మరింత మెరుగ్గా ఉండాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది. తాజాగా విడుదల చేసిన సూచీ చెప్పిన చేదు నిజం ఏమంటే.. కరోనా కారణంగా 2019లో ఉన్న 46వ ర్యాంకు కాస్తా.. ఇప్పుడు ఎనిమిది పాయింట్లు పడిపోయి 54కు చేరుకుంది.


ప్రతి రెండేళ్లకు ఒకసారి ఈ అధ్యయనాన్ని చేస్తుంటారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయటంలో పర్యాటకం ఎంతటి కీలక భూమిక పోషిస్తుందన్న సంగతి తెలిసిందే. 2019 జనవరితో పోలిస్తే 2022 జనవరిలో 67 శాతం తక్కువగా ఉన్నప్పటికి.. చాలా దేశాల పరిస్థితితో పోలిస్తే మెరుగ్గా ఉందన్న మాట వినిపిస్తోంది. ప్రయాణాలపై ఆసక్తి.. పర్యాటకం మీద ఉన్న అనురక్తి డిమాండ్ ను పెంచేలా చేస్తుందని చెబుతున్నారు. దీంతో.. ఈ రంగం పుంజుకుంటుందని చెబుతున్నారు.

అయితే.. కేంద్రం పర్యాటకానికి మరింత ఊతమిచ్చేలా చర్యలు తీసుకుంటే మేలు జరుగుతుందన్న మాట వినిపిస్తోంది. ఇక.. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే.. పర్యాటక సూచీలో అగ్రస్థానాల్లో అమెరికా.. స్పెయిన్.. జర్మనీ దేశాలు నిలిచాయి. ప్రపంచ వ్యాప్తంగా 117 దేశాలకు ర్యాంకింగ్ నిర్ణయించగా.. భారత్ గతంతో పోలిస్తే ఎనిమిది ర్యాంకులు వెనుకపడిపోయింది.