వైసీపీ అనుకున్నదొకటి జరుగుతున్నదొకటా?

Tue Jan 24 2023 10:02:26 GMT+0530 (India Standard Time)

Jagan would have got the votes of those castes

నాయకులు పార్టీలు ఎటు చూస్తున్నా.. ఎలా ఆలోచిస్తున్నా.. ప్రజలు కూడా తమదైన పంథాలో ఆలోచిస్తు న్నారు.. ఏం జరుగుతుందా.. అని ఎదురు చూస్తున్నారు. ఇది మాత్రం నిజం. ఇప్పుడు ఈ విషయం ఎందు కు చర్చించాల్సి వస్తోందంటే.. ఏపీలో రెండు ప్రధాన పార్టీలు తలపడుతున్నాయి. ఢీ అంటే ఢీ అనే రేంజ్‌లో వచ్చే ఎన్నికల్లో దూసుకుపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.అయితే.. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీ ఏం చేస్తోందనేది ఇప్పుడు చర్చకు దారితీసింది. బీసీ సామాజిక వర్గం ఓట్లు ఎక్కడ పోతాయో.. ఎక్కడ వారి మనసు ఇబ్బంది పడుతుందో అన్నట్టుగా మెత్త మెత్తగా వ్యవహ రిస్తోంది.

ఎందుకంటే.. బీసీ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు మంత్రులపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా న్యూడ్ వీడియోతో అడ్డంగా దొరికి పోయిన ఎంపీ విషయంలోనూ వైసీపీ ప్రభుత్వం మెత్తగానే వ్యవహరించింది.

అదేసమయంలో మంత్రులు ఉష శ్రీచరణ్ గుమ్మనూరు జయరాంలపై వచ్చిన ఆరోపణల విషయంలో నూ వైసీపీ అధిష్టానం ఇప్పటి వరకు నోరు విప్పలేదు. దీనికి వైసీపీ నేతలు చెబుతున్న కారణం.. ఇదంతా కూడా టీడీపీ ఉద్దేశ పూర్వకంగా బీసీలను పార్టీకి దూరం చేసేందుకు చేస్తున్న కుట్ర.. ఇప్పుడు మేం మా బీసీ నాయకులపై చర్యలు తీసుకుంటే.. అది బీసీ ఓటు బ్యాంకుపై ప్రభావం పడుతందని.. టీడీపీ ఇదే కోరుకుంటోందని అంటున్నారు.

అయితే.. వాస్తవం ఏంటో చూద్దాం.. నిజంగానే తప్పులు చేసిన వారు లేదా.. ఆరోపణలు వచ్చిన వారిని.. వెనుకేసుకు రావాలని.. వారిని సమర్థించాలని బీసీ నేతలు కానీ.. బీసీ వర్గాలు కానీ కోరుకుంటున్నాయా?

అంటే.. లేదనే చెప్పాలి. ఇలా.. వారు తప్పులు చేసిన వారిని వెనుకేసుకు రావాలని అనుకుంటే.. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి ఆరోపణలు ఎదుర్కొన్న బీసీ నేతలను కూడా గెలిపించి ఉండాలి.

కానీ అలా జరగలేదు. అంటే.. బీసీ ప్రజలైనా..మరెవరైనా.. తప్పులు చేసిన వారిని పక్కన పెట్టాలనే కోరుకుంటున్నారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలనే కోరుతున్నారు. ప్రజలకు ఒక రూల్.. నాయకులకు మరో రూల్ ఉండదు కదా! ఇదే ఇప్పుడు బీసీ ప్రజల్లో చర్చకు దారితీస్తోంది. తప్పు చేసిన వారిని ఉపేక్షిస్తే.. వీరి ఓటు బ్యాంకు వైసీపీకి దక్కే సూచనలు కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.