Begin typing your search above and press return to search.

జగన్ అన్న....షర్మిల కోసం వస్తారనుకుంటా...

By:  Tupaki Desk   |   29 Nov 2022 3:19 PM GMT
జగన్ అన్న....షర్మిల కోసం వస్తారనుకుంటా...
X
తెలంగాణా రాజకీయాలో వైఎస్సార్టీపీ రాజకీయ శక్తిగా ఏమీ కాదు. కానీ వైఎస్ షర్మిల వ్యక్తిగా పాపులర్. పైగా పొలిటికల్ ఫ్యామిలీ. ఆమెను చూసేందుకు జనాలు వస్తారు. ఆమె పాదయాత్ర చేసుకుంటూ ఉంటారు. అలా అనుకుంటే ఆమె తన ధాటిని పెంచి టీయారెస్ లీడర్స్ ని టార్గెట్ చేశారు.

ఫోకస్ కోసం చేశారా లేక తానూ పొలిటికల్ గా ఎంతో కొంత ఎదగాలని చేశారా తెలియదు కానీ ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట అతి పెద్ద ఇష్యూ అయింది. షర్మిల ఆవేశపూరిత ప్రసంగానికి తీయరెస్ లోకల్ లీడర్స్ ఏకంగా భౌతిక దాడి చేశారు. ఆమె ప్రయాణిస్తున్న వాహనాన్ని ప్రచార రధాని మొత్తం దగ్దం చేశారు.

దాంతో మండిపోయిన షర్మిల చలో ప్రగతిభవన్ అన్నారు. ప్రగతి భవన్ అంటే తెలుసు కదా. కేసీయార్ ది. ఆ చాయలకు ఏ ప్రతిపక్షం ఇప్పటిదాకా వెళ్ళలేకపోయింది. మరి వైఎస్సార్టీపీ ప్రెసిడెంట్ గా షర్మిల ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఆమెను హౌజ్ అరెస్ట్ చేసినా కారు నడుపుకుంటూ కసిగా ఆ వైపుగా నడిపారు.

మధ్యలో పంజాగుట్ట వద్ద పోలీసులు అరెస్ట్ చేసి ఆమెకు పోలీస్త్ స్టేషన్ దారి చూపించారు. సరే షర్మిల రోడ్డు మీద కారు ఆపేశారని, పోలీసులు దిగమన్నా దిగకుండా కారు లాక్ చేసుకుని ఉండిపోయారని, రెండు గంటల పాటు హై డ్రామా నడించింది అని ఎంత అయినా చెప్పవచ్చు. కానీ ఒక మహిళ అందునా ఒక ప్రముఖ రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఆడపడుచు, ఆమె అన్న పక్క రాష్ట్రంలో సీఎం గా ఉన్నారు ఆమె తండ్రి ఉమ్మడి ఏపీని ఏలారు. అన్నింటికీ మించి ఆమె కూడా ఒక పార్టీ పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు.

ఇలా చాలానే ఉన్నాయి చెప్పడానికి. అలాంటి షర్మిల కారుని ఏకంగా క్రేన్ సాయంతో ఎత్తిపడేసి పోలీస్ స్టేషన్ లో కుదేయడం అంటే నిజంగా అది దారుణమే. అందుకే షర్మిల అరెస్ట్ జాతీయ మీడియాలో హైలెట్ అయింది. ఆమె విషయం కూడా తెలంగాణా అంతటా పాకిపోయింది. ఒక ఆడ బిడ్డ విషయంలో ఇలా పోలీసులు ప్రవర్తించవచ్చా అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వంటి వారు అన్నారు.

సరే ఆమెకు ఎంతవరకూ దీని మీద విపక్షాల నుంచి మద్దతు వచ్చింది అన్నది పక్కన పెడితే ఆమెతో సహా ఆమె తల్లి భర్తతో సహా వైఎస్సార్టీపీ అభిమానుల నుంచి ఏపీలోని వైసీపీ క్యాడర్ దాకా అందరి చూపులూ ఏపీ సీఎం జగన్ మీదనే ఉన్నాయి. జగన్ రియాక్షన్ ఈ విషయంలో ఎలా ఉంటుంది అనే అంతా చూశారు.

అయితే ఆయనకు అత్యంత సన్నిహితుడు సజ్జల రామక్రిష్ణారెడ్డి షర్మిల అరెస్ట్ బాధాకరం అని చెప్పుకొచ్చారు. ఆమె మా నాయకుడు జగన్ సోదరి అని కూడా అన్నారు. అంతటితో ఆ రియాక్షన్ సరి అన్నట్లుగా వైసీపీలో ఉందా అంటే ఏమో ఎవరికీ తెలియదు కానీ అవతల తల్లి విజయమ్మ సైతం ఇండైరెక్ట్ గా జగన్ విషయంలొ అసంతృప్త్ని వ్యక్తం చేశారా అన్న చర్చ సాగుతోంది.

జగన్ వస్తారా అని మీడియా అడిగితే పక్క రాష్ట్రం సీఎం కి దీంతో ఏంటి సంబంధం అన్నట్లుగా ఆమె మాట్లాడారు అని వార్తలు వచ్చాయి. అంటే జగన్ విషయంలో ఆమె కొంత బాధతోనే ఈ మాటలు అన్నారా అని చర్చ సాగుతోంది. ఇపుడు చూస్తే షర్మిల భర్త బ్రదర్ అని మీడియా ముందు మాట్లాడుతూ జగన్ విషయంలో ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఏపీ సీఎం హైదరాబాద్‌కు రావచ్చని అన్నారు. అన్నయ్య కదా, షర్మిల కోసం వస్తాడు అనుకుంటా అని బ్రదర్ అనడంలో కూడా ఎక్కడో సెటైర్ వినిపిస్తుంది అంటున్నారు.

మొత్తానికి చూస్తే షర్మిల అరెస్ట్ కాదు కానీ జగన్ మీద ఇండైరెక్ట్ గా వత్తిడి పెరుగుతోంది. తీరా చూసే అక్కడ ఉన్నది టీయారెస్ సర్కార్. మరి టీయరెస్ తో వైసీపీకి మంచి రిలేషన్స్ ఉన్నాయని చెబుతారు. కానీ ఇపుడు షర్మిల మూలంగా అవి చెడుతాయా. ఆ విధంగా ఆమె విషయంలో ఎక్కువగా వైసీపీ రియాక్ట్ అయి తన రాజకీయ వ్యూహాలను ఇబ్బందుల్లోకి పెట్టుకుంటా. అసలు టీయారెస్ తో ఏ బంధాలు లేకపోయినా కొత్త తగవు తెచ్చుకుంటుందా అంటే ఇది ఆలోచించాల్సిన విషయమే.

 ఏది ఏమైనా ఇప్పటిదాకా విపక్షాల అరెస్టులు ఎన్నో జరిగాయి. కానీ ఈ తీరున ఒక ఆడబిడ్డ విషయంలో కారుని క్రేన్ తో సహా లాగి అరెస్ట్ చేయడం మాత్రం హైలెట్ అనే అనాలి. ఇది వివాదం కూడా అయ్యే పరిస్థితి ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.  మరోవైపు షర్మిలపై ఐపీసీ 353 333 327 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి. ఆమెను రిమాండ్‌కు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించే అవకాశం ఉంది. షర్మిలను అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తే మాత్రం అది వైసీపీకి మరింత ఇబ్బందే అని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.