Begin typing your search above and press return to search.

ఏపీలో జిల్లాల విభజనలో జగన్ వ్యూహమేంటి?

By:  Tupaki Desk   |   11 July 2020 3:30 AM GMT
ఏపీలో జిల్లాల విభజనలో జగన్ వ్యూహమేంటి?
X
ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాడు. సీఎం అయ్యాక ఇప్పటికే 90శాతం హామీలు నెరవేర్చాడు. మిగిలినవి ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నాడు. ఇప్పుడు మరో హామీని నెరవేర్చే పనిలో బిజీగా ఉన్నారు.అదే ఏపీలో జిల్లాల విభజన.

ప్రస్తుతం ఏపీలో 13 జిల్లాలున్నాయి. పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తం 25 జిల్లాలుగా మారుస్తానని జగన్ ఎన్నికల వేళ హామీ ఇచ్చారు. నిజానికి రాజకీయంగా.. సామాజికంగా.. భౌగోళికంగా పాలనపరంగా అన్ని అంశాలు జిల్లాలో విభజనలో అడ్డంకిగా ఉంటాయి. పార్లమెంట్ నియోజకవర్గం ప్రకారం ఒక జిల్లా రెండు జిల్లాల్లో ఉండే పరిస్థితులున్నాయి. దానిని జిల్లాగా చేస్తే పాత జిల్లా నేతలు రాజకీయంగా ఇబ్బందులు పడతారు. అంగీకరించకపోవచ్చు. పాతుకుపోయిన లీడర్లు అడ్డు చెప్పవచ్చు.

తాజాగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధర్మాన ప్రసాదరావు పార్లమెంట్ ప్రకారం జిల్లాల విభజన మంచిది కాదని విరమించుకోవాలని బహిరంగంగా వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లా అస్తిత్వం దాంతో పోతుందని తెలిపారు. ప్రజాభిప్రాయం ప్రకారం జిల్లాల విభజన చేయాలని సూచించారు. భౌగోళిక స్వరూపానికి అనుగుణంగా జిల్లాలను విభజించాలని కోరుతున్నారు.

తెలంగాణలో ప్రతీ వారు సొంత జిల్లా కోరుకున్నారు. కొందరు జిల్లా కోసం రోడ్డెక్కారు. ఆందోళన చేశారు. కేసీఆర్ కు ఇది తలనొప్పులు తెచ్చిపెట్టింది. అందుకే అడిగిన వారికీ.. అడగని వారికి ఒక్కో జిల్లా ఇచ్చారు. కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల జిల్లా అయితే కేవలం రెండు నియోజకవర్గాలతో ఏర్పడింది. ఇలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా సీఎం జగన్ దృష్టి సారించినట్టు తెలిసింది. మండలాలు, నియోజకవర్గాలు వేరే జిల్లాలోకి మారకుండా పకడ్బందీగా జిల్లాల విభజన చేయాలని యోచిస్తున్నారట..