Begin typing your search above and press return to search.

మూడు రాజధానుల ఏర్పాటు పై జగన్ సర్కార్ దూకుడు !

By:  Tupaki Desk   |   11 Aug 2020 5:30 AM GMT
మూడు రాజధానుల ఏర్పాటు పై జగన్ సర్కార్ దూకుడు !
X
ఏపీలో ఓ వైపు కరోనా వైరస్ ..మరోవైపు మూడు రాజధానుల అంశం కాకరేపుతుంది. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయాల్లో మూడు రాజధానుల నిర్ణయం కూడా ఒకటి. దీన్ని ఎలాగైనా అడ్డుకోవాలని టీడీపీ చూస్తుంటే , ఎట్టి పరిస్థితుల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనీ ఏపీ సర్కార్ భావిస్తుంది. దీనికోసం సరికొత్త వ్యూహం తో ప్రభుత్వం శరవేగంగా అడుగులు ముందుకు వేస్తుంది. ఇప్పటికే అధికార వికేంద్రీకరణ ,సీఆర్డీఏ బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేశారు. వాటిపై రాజ్య పత్రాలను కూడా ప్రభుత్వం విధించింది.

అయితే , కోర్టుల్లో పిటిషన్ల పై కొనసాగుతున్న జాప్యానికి చెక్ పెట్టేలా చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే అభివృద్ధి వికేంద్రీకరణ పై హైకోర్టు విధించిన స్టే పై స్టే విధించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో ఇప్పటికే పిటిషన్ వేసింది. తాజాగా సోమవారం సుప్రీం కోర్ట్ కి ఒక లేఖ కూడా రాసింది. మూడు రాజధానులు విషయంలో ఇకపై ఎంత మాత్రం జాప్యం చేయరాదని ఆ లేఖలో సుప్రీంను జగన్ సర్కార్ కోరింది. సుప్రీంకోర్టులో తాను దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై అత్యవసర విచారణ చేపట్టాలని ఏపీ సర్కార్ విజ్ఞప్తి చేసింది. మూడు రాజధానులు బిల్లు కు ఏపీ హైకోర్టు ఈ నెల 14 వరకు స్టే విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

అయితే దానిపై సోమవారం విచారణకు వస్తుందని అంతా భావించారు కానీ ఆ పిటిషన్ విచారణకు రాకపోవడంతో సోమవారమే అత్యవసర విచారణ చేపట్టాలంటూ సుప్రీంకోర్టు కు జగన్ సర్కార్ లేఖ రాసింది. ఆంధ్ర ప్రదేశ్ పాలనా వికేంద్రీకరణ , సీఆర్డీఏ రద్దు పై హైకోర్టు స్టే ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ కాపీని వేసిన వారికి పంపినట్లు ఏపీ ప్రభుత్వం తాజాగా సుప్రీంకోర్టు కి లేఖ రాసింది. ప్రతివాదులకు పిటిషన్ కాఫీ పంపినందుకు వీలైనంత త్వరగా కేసుపై విచారణ జరపాలని ప్రభుత్వం లేఖలో కోరింది. చూడాలి మరి ఏపీ ప్రభుత్వం లేక పై సుప్రీం కోర్టు ఎలా స్పందిస్తుందో.. ఏదేమైనా మూడు రాజధానుల ఏర్పాటు ఇప్పటికే ఆలస్యం అయిందని.. ఇకపై మూడు రాజధానులు విషయంలో జెట్ స్పీడ్ తో ముందుకుపోవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.