డేంజర్ నంబర్ 27... జగన్ వెరీ సీరియస్

Wed Sep 28 2022 23:00:01 GMT+0530 (India Standard Time)

Jagan on 27 MLAs

వైసీపీలో మొత్తం గెలిచింది 151 మంది ఎమ్మెల్యేలు. ఇందులో పూర్తిగా డేంజర్ జోన్ లో ఉన్న వారు 27 మంది ఉంటారని జగన్ లెక్క తీసి మరీ చెప్పారు. వారు పనితీరు మార్చుకోకపోతే మాత్రం ఇక ఇంతే సంగతులు అని జగన్ పక్కా క్లారిటీగా చెప్పేశారు. గడప గడపకు వర్క్ షాప్ లో భాగంగా జగన్ నిర్వహించిన సమావేశంలో మంత్రులు ఎమ్మెల్యేలకు బాగానే క్లాస్ తీసుకున్నారు.ఎవరైతే జనంలో ఉంటారో ఎవరైతే పనితీరు మెరుగుపరచుకుంటారో వారే తనకు కావాలని తేల్చి చెప్పేశారు. టికెట్ కావాలంటే గడప తొక్కాల్సిందే అని క్లారిటీగా చెప్పేశారు. ఎమ్మెల్యేలు 27 మంది దాకా గడప గడప కార్యక్రమానికి పెద్దగా అటెండ్ కాలేదని జగన్ ఎత్తి చూపారు. వారు పట్టుమని పదహారు రోజులు మాత్రమే తిరిగారని ఈ రకంగా ఉంటే తాను ఉపేక్షించే ప్రసక్తి లేదని జగన్ స్పష్టం చేశారు.

ప్రజలలో ఉంటేనే రాజకీయం సాగుతుందని పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తామంటే అసలు సహించే ప్రసక్తి లేదని కూడా ఆయన పేర్కొన్నారు. ఒక రకంగా జగన్ మంత్రులు ఎమ్మెల్యేలకు కూడా చురకలు అంటిస్తూ తమ ప్రసంగం సాగించారు అని అంటున్నారు. జగన్ తన దగ్గర ఉన్న నివేదికల ఆధరంగా తీసుకుని 27 మంది ఎమ్మెల్యేలు డేంజర్ జోన్ లో ఉన్నారని చెప్పారు. వారు పనితీరు మార్చుకోవాలని హెచ్చరించారు.

ఇదే తరహా సమావేశాన్ని నవంబర్ లో మరోసారి నిర్వహిస్తామని జగన్ చెప్పారు. ఇదిలా ఉండగా గడప గడపకు కార్యక్రమానికి జనాల ఆదరణ ఉందని ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వం చేసిన మంచిని చెప్పాలని అలాగే వారి సమస్యలు నేరుగా తెలుసుకుని పరిష్కరించాలని జగన్ ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ఇక టికెట్లు ఎన్నికలకు ఆరు నెలల ముందు ఇస్తామని జగన్ చెబుతున్నారు. టికెట్లు రాని వారి పేర్లు కూడా అపుడే చెబుతామని ఆయన వెల్లడించారు. మొత్తానికి పనితీరు బాలేదు అన్న వారు ఎవరో తనకూ వారికీ తెలుసు అంటూ జగన్ నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యలు పార్టీలో హీట్ పుట్టిస్తున్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.