బీజేపీ నేత విషయంలో జగన్ కీలక నిర్ణయం

Sat Aug 01 2020 21:00:30 GMT+0530 (IST)

Jagan made a key decision on BJP leader

మాజీమంత్రి పైడికొండల మాణిక్యాలరావు కరోనాతో మృతిచెందిన విషయం తెలిసిందే. కరోనా సోకిన తర్వాత తాను వెంటనే కోలుకుని తిరిగి వస్తాను అని వీడియో సందేశం పంపి ధైర్యంగా ఉన్న మాణిక్యాలరావును కరోనా కబళించేసింది. సుదీర్ఘ కాలం నిజాయితీ రాజకీయాలు చేసిన ఆయనకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఆయన మృతిపట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తంచేశారు. కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.ఈ వ్యవహారానికి సంబంధించి పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. కరోనాతో చనిపోయిన నేపథ్యంలో ఆ నిబంధనలు పాటిస్తూనే ఆయన అంత్యక్రియలు అధికార లాంఛనాలతో జరగనున్నాయి. ఆయన మృతి పట్ల ప్రముఖులందరూ సంతాపం వ్యక్తంచేశారు. తాజాగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా స్పందిస్తూ తీవ్ర విచారం వ్యక్తంచేశారు.