రైతుల కోసం జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

Tue Aug 11 2020 19:30:16 GMT+0530 (IST)

Jagan government another key decision for the farmers

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు మేలు చేకూర్చే విధంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. పరిశ్రమలు వాణిజ్య శాఖ వ్యవసాయం సహకార శాఖల సమన్వయంతో జాయింట్ టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. వ్యవసాయ ఉద్యాన ఉత్పత్తులు గిట్టుబాటు ధర మార్కెటింగ్ ఇతర అంశాలపై రైతులకు టాస్క్ ఫోర్స్ కమిటీ సేవలు అందించనుంది. వ్యవసాయ పరిశ్రమల శాఖతో సహా 11 శాఖల ఉన్నతాధికారులు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఆహారశుద్ధి విలువ జోడింపు వంటి అంశాలపై ఈ కమిటీ రైతులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటుంది.పంటకు గిట్టుబాటు ధరలు లేకపోవడం ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడం తెలియకపోవడం వంటి అనేక అంశాల వల్ల రైతులు నష్టపోతున్నారు. దీనిని గుర్తించిన ప్రభుత్వం ఈ టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి తన మార్క్ పాలన సాగిస్తున్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూనే రైతుల కోసం పలు నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ఇందులో భాగంగా తాజాగా కమిటీ పేరుతో ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే కేంద్రం ఇచ్చి పీఎం కిసాన్ యోజనకు తోడు రాష్ట్ర ప్రభుత్వం కొంత జత చేసి రైతు భరోసా ఇస్తోంది. ఖరీఫ్ సీజన్‌లో విత్తనాల ఇబ్బందులు లేకుండా సరఫరా చేసింది. నీటి సౌకర్యం లేని వ్యవసాయ భూముల్లో సొంత ఖర్చుతో బోర్లు వేయించాలని కూడా నిర్ణయించింది.