Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబు ఆరోప‌ణ‌ల‌కు స‌భ సాక్షిగా జ‌గ‌న్ కౌంట‌ర్‌.. ఏమ‌న్నారంటే..

By:  Tupaki Desk   |   27 Nov 2021 11:30 AM GMT
చంద్ర‌బాబు ఆరోప‌ణ‌ల‌కు స‌భ సాక్షిగా జ‌గ‌న్ కౌంట‌ర్‌.. ఏమ‌న్నారంటే..
X
టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు ఏపీ సీఎం జ‌గ‌న్‌.. అసెంబ్లీలోనే గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చారు. ప్ర‌స్తుతం వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌తో సీమ‌లోని జిల్లాలు అత‌లాకుత‌లం అయిన విష‌యం తెలిసిందే. ఈనేప‌థ్యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఆయా ప్రాంతాల్లో ప‌ర్య‌టించారు. బాధితుల‌ను ఓదార్చే ప్ర‌య‌త్నం చేశారు.

ఎన్టీఆర్ ట్ర‌స్ట్ త‌ర‌ఫున సాయం అందించారు. ప్ర‌భుత్వం ఏం చేస్తోంద‌ని.. బాధితుల‌ను అడిగి తెలుసుకున్నారు. అయితే.. ఈ క్ర‌మంలో నెల్లూరు జిల్లాలోనూ చంద్ర‌బాబు ప‌ర్య‌టించారు. ఈ క్ర‌మంలో ఇందుకూరు పేట మండ‌లం, గంగ‌ప‌ట్నంలో బాధితుల ఇళ్ల‌కు స్వ‌యంగా న‌డిచి వెళ్లారు.

ఈ నేప‌థ్యంలో ఒక ఇంటికి వెళ్లిన చంద్ర‌బాబుకు అక్క‌డి మునెమ్మ అనే మ‌హిళ‌.. త‌న ఇల్లు వ‌ర‌ద‌లు, వ‌ర్షాల‌తో కూలిపోయింద‌ని.. ప్ర‌భుత్వం ఆదుకోలేద‌ని.. క‌న్నీరు పెట్టుకుంది. దీంతో చంద్ర‌బాబు స‌ర్కారుపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఏపీ ముఖ్య‌మంత్రి గాలిలో తిరుగుతున్నాడు..గాలిలోనే పోతాడు.. అంటూ.. వ్యాఖ్యా నించారు.

ఈ విష‌యాన్ని మీడియా కూడా ప్ర‌ముఖంగా ప్ర‌స్తావించింది. దీంతో చంద్రబాబు చేసిన‌ ఈ వ్యాఖ్యల‌పై.. స్వ‌యంగా సీఎం జ‌గ‌న్ స‌భ‌లో ప్ర‌స్తావించారు. నిజంగానే నెల్లూరులో ఏం జ‌రిగింద‌నే విష‌యాన్ని జ‌గ‌న్ స‌బ‌లో వివ‌రించారు.

మునెమ్మ కుటుంబాన్ని ప్ర‌భుత్వం అన్నివిధాలా ఆదుకుంంద‌ని.. సీఎం జ‌గ‌న్ తెలిపారు. మునెమ్మ నివాసం ఉంటున్న ఇల్లు ప‌క్కా గృహ‌మ‌ని.. ఈ ఇంటికి అద‌నంగా ఏర్పాటు చేసుకున్న పంచ మాత్ర‌మే.. వ‌ర‌ద‌ల్లో కొట్టుకుపోయింద‌ని.. దీనినే చంద్ర‌బాబు చూసి.. ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డార‌ని.. జ‌గ‌న్ ఆక్షేపించారు.

ప‌క్కా ఇల్లుకావ‌డం.. ఇంటికి ఎలాంటి న‌ష్టం క‌ల‌గ‌క‌పోవ‌డంతో.. మ‌రో ఇల్లు క‌ట్టించే అవ‌కాశం లేద‌న్న జ‌గ‌న్‌... అయితే.. ఇప్ప‌టికే ఈ మునెమ్మ కుటుంబానికి బియ్యం, నిత్యావ‌స‌రాలు.. స‌హా ఆమెకు, ఆమె భ‌ర్త‌కు క‌లిపి 4200 రూపాయ‌లు ప‌రిహారంగా అందించామ‌ని వివ‌రించారు.

దీనికి సంబంధించిన‌ర‌సీదు కూడా ఉంద‌ని.. ఈ విష‌యం తెలుసుకోకుండానే.. చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై
విమ‌ర్శ‌లు చేయ‌డం.. ఏంట‌ని ప్ర‌శ్నించారు. త‌న హ‌యాంలో బియ్యం ఇస్తేనే గొప్ప అనుకున్న చంద్ర‌బా బు.. ఇప్పుడు.. తాము బియ్యంతోపాటు న‌గ‌దు కూడా ఇస్తున్న విష‌యాన్ని తెలుసుకోకుండా.. ఆరోపణ‌లు చేస్తున్నార‌ని.. మండిప‌డ్డారు.

ఈ సంద‌ర్భంగా మునెమ్మ‌కు ప్ర‌భుత్వం ఎప్పుడెప్పుడు ఎలాంటి సాయం చేసింద‌నే విష‌యంపై.. సీఎం తారీకుల వారీగా వివ‌రాలను స‌భ‌కు వివ‌రించారు.