ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తో వైఎస్ జగన్ అలర్ట్?

Wed Sep 11 2019 12:06:04 GMT+0530 (IST)

ఇటీవలి ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఏకంగా నూటా యాభై ఒక్క సీట్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేలు నెగ్గారు. వారిలో అంతకు ముందు పెద్దగా రాజకీయ నేపథ్యం లేని వారు కూడా చాలా మంది ఉన్నారు. జగన్ గాలిలో ఎవరు పోటీ చేస్తే వాళ్లంతా విజయం సాధించేశారు.అలా గెలిచి వంద రోజులు గడిచిపోయాయి. జగన్ తన  మార్కు పాలన చేస్తూ ఉన్నారు. ప్రత్యేకత చూపాలని జగన్ తాపత్రయపడుతూ ఉన్నారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే గురించి కూడా జగన్ ఇంటెలిజెన్స్ తో రిపోర్టులు తెప్పించుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగా తాజాగా అందిన ఒక నివేదిక సీఎంనే ఆశ్చర్యపరించిందని సమాచారం.

అదేమిటంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున నెగ్గిన వారిలో దాదాపు డెబ్బై తొమ్మిది మంది గురించి ప్రజలకు పెద్దగా అవగాహన కూడా లేదట. వారి వారి నియోజకవర్గాల్లోనే ఆ ఎమ్మెల్యేలకు తగినంత గుర్తింపు లేదని సమాచారం. జగన్ గాలిలో వారు గెలిచారు. జగన్ ను చూసి జనాలు ఓటేయడంతో.. వాళ్లు ఎమ్మెల్యేలు అయ్యారు.

అలాంటి ఎమ్మెల్యేలకు ఇప్పటికీ నియోజకవర్గంలో ఎలాంటి గుర్తింపు లభించడం లేదని సమాచారం. అలా తగిన స్థాయి గుర్తింపుకు నోచుకోని - కేవలం జగన్ పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున నెగ్గిన ఎమ్మెల్యేల సంఖ్య దాదాపు డెబ్బై తొమ్మిది వరకూ ఉందని ఇంటెలిజెన్స్ నివేదికలో పేర్కొందట. ఈ నివేదికతో జగన్ మోహన్ రెడ్డి కూడా అలర్ట్ అయినట్టుగా సమాచారం. పనితీరుతో జనాల్లోకి వెళ్లాలని సదరు ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా క్లాసులు వేసుకోవడానికి జగన్ రెడీ అవుతున్నారని తెలుస్తోంది!