Begin typing your search above and press return to search.

3 రాజధానుల పై జగన్ సర్కార్ కీలక వ్యూహం

By:  Tupaki Desk   |   23 Jan 2020 5:50 AM GMT
3 రాజధానుల పై జగన్ సర్కార్ కీలక వ్యూహం
X
శాసనసభలో 3 రాజధానుల బిల్లును ఎలాంటి ఆటంకం లేకుండా ఆమోదించుకున్న వైసీపీ సర్కారు బలం లేని శాసనమండలిలో మాత్రం నెగ్గించుకోలేకపోయింది. 3 రాజధానుల బిల్లును టీడీపీ ప్రోద్బలంతో మండలి చైర్మన్ సెలెక్ట్ కమిటీకి పంపడంతో ఈ బిల్లు 3 నెలల పాటు వాయిదా పడనుంది. వైసీపీ ఎంత ప్రయత్నాలు చేసినా మండలి లో బిల్లు నెగ్గుకు రాక పోవడంతో దీనిపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై వైసీపీ సర్కారు ఫోకస్ చేసింది. ఢిల్లీ నుంచి వచ్చిన సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీతో చర్చిస్తోంది.

+ఈ భేటిలో ప్రధానంగా జగన్ సర్కారు 3 ఆప్షన్లపై దృష్టిసారించింది.

1) ఆర్డినెన్స్ తీసుకురావడం..
శాసనమండలిని ప్రొరోగ్ చేసి 3 రాజధానులపై ఆర్డినెన్స్ తీసుకురావాలని జగన్ సర్కారు మొదటి ప్లాన్ గా భావిస్తోంది. అయితే బిల్లు సజీవంగా ఉంచడం కష్టం. న్యాయపరమైన చిక్కులు ఉంటాయి. ప్రభుత్వం రిస్క్ చేస్తుందా లేదా చూడాలి.

2) శాసన మండలిని రద్దు చేయడం..
151మందితో శాసనసభ లో బిల్లును పాస్ చేయించుకుంటున్న వైసీపీ సర్కారు శాసనమండలి లో మాత్రం బలం లేక పోవడంతో బిల్లులను పాస్ చేయించుకో లేకపోతోంది. అందుకే మండలిని రద్దు చేస్తే బెటర్ అన్న ఆలోచలను వైసీపీ సర్కారు తెరపైకి తెచ్చింది. అయితే మండలి రద్దు కేంద్రం పరిధిలో ఉంది కాబట్టి దీని రద్దు ఎంత లేదన్నా ఒక ఏడాది సమయం పడుతుందని నిపుణులు భావిస్తున్నారు.

3) సెలెక్ట్ కమిటికి పంపడం..
చిట్టచివరిగా సెలెక్ట్ కమిటీ రిపోర్ట్ వచ్చేవరకూ ప్రభుత్వం వేచి చూడడం.. కమిటీ రిపోర్ట్ రావాలంటే 3 నెలల సమయం పడుతుంది. రిపోర్ట్ వచ్చాక అసెంబ్లీ కి మళ్లీ బిల్లు వస్తుంది కాబట్టి అప్పటి వరకూ ఎదురు చూడాలి.

అయితే ఈ మూడు ఆప్షన్లపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్న ప్రభుత్వం 3 రాజధానుల పై మాత్రం వెనక్కి తగ్గకూడదని కృత నిశ్చయంతో ముందుకెళ్తోంది. బిల్లు ఆలస్యమైనా కానీ 3 రాజధానులు ఖాయమని చెబుతోంది. ఆరునెలలు అయినా రాజధాని తరలింపు ఖాయమంటోంది.