Begin typing your search above and press return to search.

ఆ 5 ఏజెన్సీ ప్రాంతాల్లో ఆస్పత్రుల నిర్మాణం .. జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం!

By:  Tupaki Desk   |   29 Sep 2020 10:30 AM GMT
ఆ 5 ఏజెన్సీ ప్రాంతాల్లో ఆస్పత్రుల నిర్మాణం .. జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం!
X
ఏపీలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీ స్థానాల్లో గెలిచి సగౌరవంగా అధికారాన్ని చేపట్టిన సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ముందు చెప్పిన ప్రతి హామీని నెరవేరుస్తూ ముందుకుసాగుతున్నారు. ఎన్నికల ప్రచారం లో ఇచ్చిన హామీలు , ఎన్నికల ఫలితాల తర్వాత నేతలు అసలు గుర్తుకు రాని ఈ రోజుల్లో అధికారంలోకి వచ్చిన తోలి ఏడాదిలోనే దాదాపుగా ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన 90 శాతం హామీలని నిరవేర్చారు. ప్రతి పేద వాడికి కూడా ఎదో ఒక విదంగా సహాయం చేయాలనే లక్ష్యంతో ఎన్నో సంక్షేమ పథకాల్ని తీసుకొచ్చారు.

ఈ క్రమంలోనే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గిరిజన ప్రజలపై తాజాగా జగన్ సర్కారు శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ లోని ఐటిడిఎ ప్రాంతాల్లో మల్టీస్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మాణాలకు పూనుకుంది. వీటికోసం నేడు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. మొత్తంగా 5 ఏజెన్సీ ప్రాంతాల్లో ఆసుపత్రుల నిర్మాణం కోసం రూ 246.3 కోట్లకు పరిపాలనా అనుమతులు ఇచ్చింది. ఒక్కో ఆసుపత్రికి 49.26 కోట్ల రూపాయలు కేటాయించింది. సీతంపేట (శ్రీకాకుళం), పార్వతిపురం (విజయనగరం), రామచంద్రపురం (తూ.గో), బుట్టాయిగూడెం (ప.గో), దోర్నాల (కర్నూల్) లో అత్యాధునిక సౌకర్యాలతో ఆసుపత్రులను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఏపీ ప్రభుత్వం తాజా నిర్ణయంతో అసలే సరైన రోడ్లు, రవాణా సదుపాయాల్లేక.. ఆరోగ్యం క్షీణిస్తే గిరిపుత్రులు.. నిండు గర్భిణిలు పడుతున్న బ్రతుకు వ్యథలు కొంతైనా తీరే అవకాశం ఉంది.

ఆ 5 ఏజెన్సీ ప్రాంతాల్లో ఆస్పత్రుల నిర్మాణం .. జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం !

గిరిపుత్రులకి శుభవార్త చెప్పిన జగన్ సర్కార్ !