మంత్రి మాటలకు ముసిముసి నవ్వులు నవ్వుకున్న జగన్...!

Sun Nov 28 2021 09:00:01 GMT+0530 (IST)

Jagan Laughed At The Minister Words

ఏపీ అసెంబ్లీలో పలు ఆసక్తికర విషయాలు.. చోటు చేసుకున్నాయి. మరికొన్ని వివాదాస్పద విషయాలు కూ డా జరిగాయి. ఆసక్తికర విషయానికి వస్తే.. టీడీపీ అధినేత చంద్రబాబు.. ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు.. ఆయా ప్రాంతాల్లో నిర్వహిస్తున్న సభలు ప్రసంగాల్లో.. సీఎం జగన్.. పట్టించుకోవడం లేదని.. ఏరియల్ సర్వే చేసి వెళ్లారు తప్ప.. ఎవరినీ పరామర్శించలేదని.. వ్యాఖ్యా నించారు. కట్ చేస్తే.. ఈ విషయంపై అసెంబ్లీలో సీఎం జగన్ ప్రస్తావించారు. తను వెళ్లడం వల్ల.. ఇబ్బందు లే తప్ప ఎలాంటి ప్రయోజనం లేదని అన్నారు.అయితే సీఎం ప్రసంగంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు తోడు.. అక్కడి ప్రజలు ఎలా రియాక్ట్ అయ్యార నే విషయం చర్చకు వచ్చింది. దీంతో ఆయన ఆ విషయాన్ని చెప్పబోతూ.. నా కన్నా.. స్పాట్‌లో విషయం తెలిసిన మంత్రి బాలినేని శ్రీనివాస్ చెబుతారంటూ.. జగన్ ఆయనకు మైక్ ఇవ్వాలని స్పీకర్‌ను కోరారు. దీంతో బాలినేని సీఎం ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ``చంద్రబాబు చిత్తూరులో ఒక ప్రాంతానికి వెళ్లారు అధ్యక్షా!. అక్కడ టీడీపీ నాయకులు జనాలను పోగేశారు. దీంతో ఆవేశంతో ఉన్న చంద్రబాబు.. మీకు.. సాయం అందుతోందా? అని ప్రశ్నించారు. దీనికి వారు అందుతోంది! అని సమాధానం ఇచ్చారు అధ్యక్షా!`` అని వివరించారు.

అంతేకాదు.. సభలో ఉన్నవారు తమకు డబ్బులు కూడా ఇచ్చారని చెప్పడంతో చంద్రబాబుకు చిర్రెత్తు కొచ్చిందని.. వెంటనే తన పార్టీ నేతలను పిలిచి.. ఇలాంటి చోటకు ఎందుకు తెచ్చారయ్యా ? అని ప్రశ్నించడంతోపాటు మొట్టికాయలు కూడా వేశారని.. బాలినేని సభకు వివరించారు. దీంతో ఒక్కసారిగా సభలో ఆశ్చర్యం వేసింది.

అనంతరం బాలినేని కొనసాగిస్తూ.. అన్ని జిల్లాల్లోనూ సాయం అందిందని.. బియ్యం ఉప్పు పప్పు.. సహా.. డబ్బులు కూడా బాధితులకు అందించామని.. వివరించారు. దీంతో సీఎం .. ముసిముసి నవ్వులు నవ్వుకోవడం.. స్క్రీన్‌పై కనిపించడంతో సభలో నవ్వులు విరబూశాయి.