Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ ఇదెక్క‌డి న్యాయం.. లెక్క‌లు చూస్తే త‌రుక్కుపోతోందిగా..!

By:  Tupaki Desk   |   24 Nov 2021 11:30 AM GMT
జ‌గ‌న్ ఇదెక్క‌డి న్యాయం.. లెక్క‌లు చూస్తే త‌రుక్కుపోతోందిగా..!
X
ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి అధికారంలోకి వ‌చ్చాక అన్ని కులాల వారీకి ప‌ద‌వులు ఇస్తున్నాన‌ని లెక్క‌ల‌తో స‌హా గొప్ప‌గా చెప్పుకుంటున్నారు. తాను ప్ర‌తిసారి భ‌ర్తీ చేస్తోన్న ప‌ద‌వుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వ‌ర్గాల‌కు 50 శాతం ప‌ద‌వులు ఇస్తున్నాన‌ని చెప్పుకుంటూ వ‌స్తున్నారు. ప్ర‌తిసారి ఇదో డ‌బ్బాలా మారింది. అయితే ఇందులో చాలా మ‌త‌ల‌బే ఉంది. రాష్ట్ర జ‌నాభాలో బీసీ, ఎస్సీ, ఎస్టీల‌తో పాటు మైనార్టీలు కూడా క‌లిస్తే వీరి జ‌నాభానే 80 శాతం వ‌ర‌కు ఉంటుంది. బీసీల జ‌నాభానే 50 శాతం పైగా ఉంది. వీరికి తోడు ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు క‌లుపుకుంటే వీరి జ‌నాభా 80 శాతం. ఇక అగ్ర‌వ‌ర్ణాల జ‌నాభా 20 శాతం మాత్ర‌మే ఉంటుంది.

అలాంటి వ‌ర్గాల‌కు ఏదో 50 శాతం ప‌ద‌వులు ఇచ్చామ‌ని చెప్పుకోవ‌డం ఏమాత్రం గొప్ప అన్న ప్ర‌శ్న‌లు కూడా వ‌స్తున్నాయి. జ‌గ‌న్ తాజాగా కూడా అసెంబ్లీలో మండ‌లి గురించి ప్ర‌స్తావించారు. మండ‌లిలో త‌మ పార్టీ నుంచి మొత్తం త్వ‌ర‌లోనే 32 మంది ఎమ్మెల్సీలు కాబోతున్నార‌ని.. వీరిలో 18 శాతం ప‌ద‌వులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల‌కే ఇచ్చామ‌ని గొప్ప‌గా చెప్పుకుంటున్నారు. అస‌లు వీరిలో ఎంత‌మంది త‌మ త‌మ వ‌ర్గాల ప్ర‌జ‌ల కోసం పార్టీలో బ‌లంగా గొంతెత్తుతారు ? అంటే ఎవ్వ‌రూ చెప్ప‌లేని ప‌రిస్థితి. విచిత్రం ఏంటంటే ఒక వ‌ర్గం నేత‌ల‌కు ప‌ద‌వులు ఇస్తున్నామ‌ని చెప్పుకోవ‌డం గొప్ప‌కాదు.. ఆ ప‌ద‌వులు ఇచ్చిన వారు త‌మ స్వార్థం చూసుకోవ‌డ‌మో లేదా బుగ్గ‌న బెల్లం ముక్క పెట్టుకుని కూర్చోవ‌డ‌మే కాదు. త‌మ వ‌ర్గాన్ని జాగృతం చేసిన‌ప్పుడే ఆ ప‌ద‌వికి విలువ ఉంటుంది.

కానీ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌ద‌వులు ఇస్తోన్న వారిలో ఎవ్వ‌రూ కూడా జ‌గ‌న్‌కు ఎదురు చెప్ప‌లేని వారు .. క‌నీసం త‌మ వ‌ర్గం బాగోగులు కూడా ప‌ట్టించుకునే వారు కూడా కాదు. 80 శాతం జ‌నాభా ఉన్న వ‌ర్గాల‌కు 52 శాతం ఎమ్మెల్సీ ప‌ద‌వులు ఇచ్చానని చెపుతూ జ‌గ‌న్ వాళ్ల క‌న్నీళ్లు తుడిచే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇక ఓపెన్ కేట‌గిరి వ‌ర్గాల‌కు జ‌గ‌న్ ఇస్తోన్న ప‌ద‌వుల్లో కూడా మూడొంతుల మంది రెడ్లే ఉంటున్నారు.

అస‌లు అసెంబ్లీలోనే 50 మంది రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారు. దీనిని బ‌ట్టే జ‌గ‌న్ ఎంత‌లా సామాజిక న్యాయం చేస్తున్నారో తెలుస్తోంది. ఇటీవ‌ల ఎమ్మెల్సీల్లోనూ ఇద్ద‌రు రెడ్ల‌కు ఎమ్మెల్సీలు క‌ట్ట‌బెట్టారు. రాజ్య‌స‌భ ప‌ద‌వులు చూసినా వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి, విజ‌య‌సాయిరెడ్డి, అయోధ్య రామిరెడ్డి ఇలా మ‌రో అగ్ర‌వ‌ర్ణం నేత‌ల‌కు ఛాన్స్ లేకుండా చేస్తున్నారు. మ‌రి ఈ లెక్క‌లు చూస్తే జ‌గ‌న్ న్యాయం పేరుతో అటు ఎస్సీ, బీసీ, మైనార్టీ వ‌ర్గాల‌కే కాకుండా రెడ్లు త‌ప్ప మిగిలిన అగ్ర వ‌ర్ణాల‌కు అన్యాయం చేస్తున్నార‌నే అనుకోవాలి. వీటికి ఆన్స‌ర్లు లేకుండా జ‌గ‌న్ త‌న‌కు తానే సామాజిక న్యాయం చేస్తున్నాన‌ని ప్ర‌క‌టించుకోవ‌డాన్ని ఏమ‌నుకోవాలి..!