Begin typing your search above and press return to search.

ఉద్యోగుల్లో జ‌గ‌న్ ఇమేజ్ ఇంత డ్యామేజా ?

By:  Tupaki Desk   |   20 Jan 2022 6:51 AM GMT
ఉద్యోగుల్లో జ‌గ‌న్ ఇమేజ్ ఇంత డ్యామేజా ?
X
ఉద్యోగుల్లో జ‌గ‌న్ ఇమేజ్ డ్యామేజ్ అవుతోందా ? రెండు వారాల క్రిత‌మే జ‌గ‌న్ మీడియా స‌మావేశం పెట్టి మ‌రీ ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు పీఆర్సీ ప్ర‌క‌ట‌న చేశారు. ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా ఉద్యోగుల ప‌ద‌వి వీర‌మ‌ణ వ‌య‌స్సు 62 సంవ‌త్స‌రాల‌కు పెంచారు. ఫిట్‌మెంట్ 23 శాతం ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌ట‌న చేశారు. జీతాల పెంపుకోసం ఎదురు చూస్తోన్న ఉద్యోగుల‌కు ఉద్యోగ ప‌ద‌వి విర‌మ‌ణ వ‌య‌స్సు పెంచ‌డంతో వారు కూడా హ్యాఫీ ఫీల‌య్యారు. రాష్ట్ర వ్యాప్తంగా జ‌గ‌న్‌కు పాలాభిషేకాలు చేశారు. త‌మకు సంక్రాంతి ముందుగానే వ‌చ్చింద‌ని సంబ‌రాలు చేసుకున్నారు.

అయితే ఇప్పుడు సంక్రాంతి వెళ్లింది. ఇక్క‌డ క‌ట్ చేస్తే సీన్ మారిపోయింది. ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు అలా వ‌చ్చాయో లేదో జ‌గ‌న్ దేవుడు అని కీర్తించిన ఆ నోళ్ల‌తోనే ఇప్పుడు చ‌రిత్ర హీనుడిగా మిగిలిపోతాడంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. పైగా ఈ నెల 21 నుంచి స‌మ్మ‌కు దిగుతున్న‌ట్టు ప్ర‌క‌ట‌న చేస్తున్నారు. జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయ్యి స‌చివాల‌యంలోకి ఎంట్రీ ఇచ్చిన వెంట‌నే ఉద్యోగుల‌పై వ‌రాల జ‌ల్లు కుర‌పించేశారు. పీఆర్సీ ప్ర‌క‌ట‌న ఆల‌స్యం కావ‌డంతో 27 శాతం మ‌ధ్యంత‌ర భృతి ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌ట‌న చేశారు.

సీసీఎస్ ర‌ద్దుపై హామీ ఇచ్చారు. అయితే క‌రోనా దెబ్బ‌తో ఆర్థిక ప‌రిస్థితి కుదేలైంది. ఈ ప‌రిస్థితుల్లో ఉద్యోగుల జీతాలు పెంచాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. జ‌గ‌న్ పీఆర్సీ ప్ర‌క‌ట‌న వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఉత్త‌ర్వుల్లో సీన్ మారింది. ఎక్క‌డిక‌క్క‌డ కోతులు క‌నిపించాయి. ఇప్పుడు ఫిట్‌మెంట్ 23 శాతం. ఐఆర్ కంటే ఫిట్‌మెంట్ 4 శాతం త‌క్కువ‌. పైగా 2019 జూలై నుంచి చెల్లించిన 27 శాతం మ‌ధ్యంత‌ర భృతి నుంచి ఫిట్‌మెంట్ 23 శాతం పరిగ‌ణ‌లోకి తీసుకోవ‌డంతో ఉద్యోగులే ప్ర‌భుత్వానికి 4 శాతం బ‌కాయిప‌డ్డారు.

ఇక పెండింగ్‌లో ఉన్న 5 డీఏలు ఇవ్వాల‌ని నిర్ణ‌యించిన ప్ర‌భుత్వం 18 నెలల ఆ బకాయిలు నుంచి 4 శాతం ఐఆర్ మొత్తాన్ని మినహాయిస్తుంది. ఇక నుంచి పదేళ్లకు ఒక్కసారే వేతన సవరణ అమలు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించింది. ఇక 80 ఏళ్లు దాటిన వారికే అద‌న‌పు పెన్ష‌న్ వ‌ర్తిస్తుంది. ఇక ఇంటి అద్దె భ‌త్యం విష‌యంలోనూ ప్ర‌భుత్వం కోత‌లు పెట్టేసింది. 30 శాతం హెచ్ఆర్ ను 16, 8 శాత‌కుం త‌గ్గించేసింది.

ఓవ‌రాల్‌గా ఒక్కో ఉద్యోగికి జీతంలో 7 నుంచి 12 వేల వ‌ర‌కు కోత‌లు ప‌డుతున్నాయి. ఇక‌పై కేంద్ర ప్ర‌భుత్వ త‌ర‌హాలోనే కొత్త పీఆర్సీ ఉంటుంద‌ని ప్ర‌క‌ట‌న చేసింది. ఓవ‌రాల్‌గా చూస్తే జ‌గ‌న్ స‌ర్కార్‌పై ఉద్యోగులు తిరుగుబావుటాకు రెడీ అవుతున్నారు. జ‌గ‌న్ ఇమేజ్ ఉద్యోగుల్లో భారీగా డ్యామేజ్ కానుంది.