Begin typing your search above and press return to search.

దగ్గుబాటి రాజకీయానికి జగన్ ఫుల్ స్టాప్

By:  Tupaki Desk   |   20 Nov 2019 8:45 AM GMT
దగ్గుబాటి రాజకీయానికి జగన్ ఫుల్ స్టాప్
X
తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం కొన్నేళ్ల తర్వాత క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఎన్టీఆర్ సొంత అల్లుడిగా టీడీపీ ఏర్పాటు, పయనంలో చంద్రబాబుతోపాటు కీలకపాత్ర పోషించారు దగ్గుబాటి.. అయితే ఎన్టీఆర్ మరణం తర్వాత చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలు చూసి బాబుకు వ్యతిరేకంగా రాజకీయాలకు దూరమయ్యాయి. తన భార్య అయిన పురంధేశ్వరిని రాజకీయాల్లో యాక్టివ్ చేశారు.

2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ తన కుమారుడి రాజకీయ భవిష్యత్ కోసం దగ్గుబాటి మళ్లీ చాన్నాళ్ల తర్వాత వైసీపీలో చేరారు. కుమారుడికి పర్చూర్ టికెట్ ఆశించారు. కానీ అతడికి పౌరసత్వం సమస్య ఏర్పడింది. దీంతో జగన్ కోరిక మేరకు స్వయంగా దగ్గుబాటినే పర్చూరులో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో దశాబ్ధాల తర్వాత మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వైసీపీ అధినేత కోరిక మేరకు వచ్చారు. కానీ పర్చూరులో దగ్గుబాటి ఓడిపోయారు.

దగ్గుబాటి వైసీపీలో ఉండడం.. ఆయన భార్య - బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి బీజేపీలో ఉండడం వివాదానికి దారితీసింది. పొద్దున లేస్తే చాలు జగన్ సర్కారును పురంధేశ్వరి విమర్శిస్తోంది. దీంతో దగ్గుబాటి దంపతులిద్దరూ అయితే వైసీపీలో లేదంటే బీజేపీలో ఉండాలని జగన్ అల్టీమేటం జారీ చేశారని వార్తలొచ్చాయి.. దీనిపై దగ్గుబాటి ఎటూ తేల్చుకోకుండా చర్చలు జరిపినా ఫలితం దక్కలేదట..

తాజాగా ఒంగోలులో నిర్వహించిన నాడు-నేడు కార్యక్రమంలో పర్చూరు నియోజకవర్గ ఇన్ చార్జి హోదాలో వైసీపీ నేత రామనాథం బాబు జగన్ పక్కనే ఆసీనులయ్యారు. దీంతో దగ్గుబాటికి జగన్ చెక్ చెప్పినట్టేనని స్పష్టమైంది. పర్చూరులో వైసీపీ పూర్తి బాధ్యతలను రామనాథంబాబుకు ఇచ్చిన జగన్ అక్కడ నేతలను సమన్వయం చేసుకోవాలని సూచించారట..

ఇలా జగన్ కోరిక మేరకే క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన దగ్గుబాటి మళ్లీ ఆయన తిరస్కరణతోనే రాజకీయాలకు దూరం జరగడం నిజంగా ఔచిత్యమే మరీ..