Begin typing your search above and press return to search.

టీడీపీ నేతలు బఫూన్లలా ఉన్నారు..బాబు పై ఫైర్ అయిన సీఎం!

By:  Tupaki Desk   |   16 Dec 2019 11:19 AM GMT
టీడీపీ నేతలు బఫూన్లలా ఉన్నారు..బాబు పై ఫైర్ అయిన సీఎం!
X
ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో వైసీపీ -టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. సభ ప్రారంభమైన మొదటిరోజు నుండి ఇదే తీరుతో సమావేశాలు జరుగుతున్నాయి. ఒకరి పై ఒకరు ఆరోపణలు - విమర్శలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంలో తాజాగా ..ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ..ప్రతిపక్ష నేత చంద్రబాబు పై అసెంబ్లీ వేదికగా మరోసారి ఫైర్ అయ్యారు.

ఈ రోజు ఎస్సీ - ఎస్టీలకు ప్రత్యేక కమిషన్‌ ల పై అసెంబ్లీలో చర్చ జరిగింది. దీనిపై చంద్రబాబు నాయుడు మాట్లాడిన తరువాత సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ..బాబు అన్ని అబద్దాలే చెప్తున్నారు అంటే మండిపడ్డాడు. చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేనని విమర్శించారు. చంద్రబాబు లాంటి నాయకుడా మనకు కావాల్సింది..?. ప్రతిపక్షనేతగా కూడా చంద్రబాబుకు ఉండే అర్హత లేదు. చారిత్రాత్మక బిల్లు తెస్తుంటే టీడీపీ సభ్యులు బఫూన్లుగా ప్రవర్తిస్తున్నారు. ఎస్సీ - ఎస్టీ అంశాలు ప్రజల్లోకి పోకుండా చేయాలని టీడీపీ సభ్యులు చూస్తున్నారు. నా ప్రతి అడుగు పేదవారికి తోడుగా ఉంటుంది అని జగన్ తెలిపారు.

బాబు 2003లోనే తాము ఎస్సీ కమిషన్‌ తెచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. నిజానికి నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ఎస్సీ - ఎస్టీస్‌ 1992లోనే వచ్చిందని - 1994-95 మధ్యకాలంలో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు 2004 ఎన్నికలకు ముందు రాజకీయ ఆలోచనతో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ - ఎస్టీ కమిషన్‌ ను తీసుకొచ్చారని - 1992లో జాతీయ ఎస్సీ - ఎస్టీ కమిషన్‌ వస్తే.. 2003 దాకా రాష్ట్రంలో అలాంటి కమిషన్‌ తీసుకురావాలన్న ఇంగితజ్ఞానం కూడా లేకుండా చంద్రబాబు అప్పట్లో పరిపాలించారని మండిపడ్డారు.

అలాగే బాబు కేబినెట్‌ లోని మంత్రే దళితులు స్నానం చేయరు - వారి వద్ద వాసన వస్తుందని అనుచితంగా వ్యాఖ్యలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రాజధాని విషయంలోనూ ఎస్సీ - ఎస్టీ - బీసీ - మైనారిటీలకు చంద్రబాబు ఏరకంగా అన్యాయం చేశారో గణాంకాల సాక్షిగా సీఎం వైఎస్‌ జగన్‌ సభకు వివరించారు. అలాగే చంద్రబాబు దళితుల గురించి చాలా సార్లు లోకువగా మాట్లాడారు అని , దళితుల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని అన్నారు అని , ఈ నేపథ్యంలో ఎస్సీ - ఎస్టీలకు ప్రత్యేక కమిషన్‌ పై చర్చ జరుగుతుంటే .. టీడీపీ నేతలు బఫూన్లలా ప్రవర్తిస్తున్నారు. టీడీపీ నేతల్ని సభ నుంచి సస్పెండ్‌ చేసినా తప్పులేదు అని బాబుపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.