Begin typing your search above and press return to search.

జగన్ నో అంటే బాబు ఎస్ ... నలభై సీట్లలో తీవ్ర ప్రభావం...?

By:  Tupaki Desk   |   30 Sep 2022 10:41 AM GMT
జగన్ నో అంటే బాబు ఎస్ ... నలభై సీట్లలో తీవ్ర ప్రభావం...?
X
ఏపీ సీఎం జగన్ ఒక కీలక విషయంలో నో అనేస్తున్నారు. అదే ప్రతిపక్ష నేత చంద్రబాబు మాత్రం వెల్ కం అంటున్నారు. ఆ కీలక నిర్ణయం ఏంటి అంటే వారసులకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడం. ఇటీవల జరిగిన వైసీపీ వర్క్ షాప్ లో జగన్ వారసులకు టికెట్లు ఇచ్చేది లేదని చెప్పి సీనియర్లకు షాక్ తినిపించారు. ఇప్పటికే తమ పుత్ర రత్నాలను రెడీ చేసుకుని తమ నియోజకవర్గాలలో పెద్ద ఎత్తున తిప్పేస్తున్న సీనియర్లు జగన్ నిర్ణయంతో ఒక్కసారిగా డీలా పడ్డారు.

వైసీపీలో సీనియర్లుగా ఉన్న బాలినేని శ్రీనివాసులురెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, పేర్ని నాని, ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాసరావు, మకతోటి సుచరిత. సామినేని ఉదయభాను, భూమన కరుణాకరరెడ్డి, బుగ్గన రాజెనరనాధ్ రెడ్డి, ముస్తఫా, కొడాలి నాని వంటి వారు ఉన్నారు. వీరంతా తమ వారిని తీర్చి దిద్ది వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించాలని చూస్తున్నారు.

అయితే పేర్ని నాని వర్క్ షాప్ లో ఓపెన్ గానే జగన్ తో ఈ విషయం మాట్లాడారు. ఆనక జగన్ ఆయన్ని పిలిపించుకుని వచ్చే ఎన్నికలు టఫ్ గా ఉంటాయి కాబట్టి మీరు పోటీ చేయండి వారసులు వద్దు అని చెప్పేశారు. అంతే కాదు అందరికీ అదే మాట అని కూడా పేర్కొనడంతో సీనియర్లు షాక్ తినేశారు. అయితే టీడీపీలో మాత్రం వారసుల విషయంలో చంద్రబాబు సానుకూలంగా ఉన్నారని అంటున్నారు.

బాబే స్వయంగా సీనియర్లతో మీ వారసులను దింపితే టికెట్లు ఇస్తామని చెప్పి పెద్ద వారిని పక్కన పెడుతున్నారు. అలా కనుక చూస్తే ఆ పార్టీలో మాజీ మంత్రులు కిమిడి మృణాళిని, జవహర్, పరిటాల సునీత, ఎంపీ కేశినేని నాని, అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి వంటి వారు తమ వారసులను పోటీకి దించేందుకు ఉత్సాహపడుతున్నారు.

ఈసారి ఎన్నికల్లో యువతకు పెద్ద పీట వేయాలని బాబు ఆలోచిస్తున్నారు. అందుకే ఆయన వారసులను ముందుకు తెస్తున్నారు. అయితే బాబు ఒకలా ఆలోచిస్తే జగన్ మాత్రం దానిని భిన్నంగా సీనియర్లు పోటీ చేయాల్సిందే అంటున్నారు. మరి యూత్ తో పోటీ పడితే సీనియర్లు దూకుడు చేయగలరా వచ్చే ఎన్నికల్లో యూత్ ఓటర్లు కూడా ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉన్న నేపధ్యం నుంచి చూసినపుడు చంద్రబాబు ప్లాన్ వర్కౌట్ అవుతుందని అంటున్నారు.

అదే టైం లో జగన్ సీనియర్లను పెట్టుకుని రంగంలోకి దిగితే కచ్చితంగా నలభై నుంచి యాభై నియోజకవర్గాలతో ఆ ప్రభావం గట్టిగా పడుతుంది అని అంటున్నారు. చూడాలి మరి జగన్ ప్లాన్ ఏంటో అన్నదే ఆ పార్టీలొ అందరి మాట. అయితే వారసులకు టికెట్లు లేవు అన్న మాటతో మాత్రం వైసీపీలో సీనియర్లు ఫుల్ డల్ అయిపోయారు అన్నది లేటెస్ట్ టాక్.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.