Begin typing your search above and press return to search.

నిరుద్యోగుల‌కు మ‌రో వ‌రం ఇచ్చిన జ‌గ‌న్‌

By:  Tupaki Desk   |   22 Oct 2019 12:20 PM GMT
నిరుద్యోగుల‌కు మ‌రో వ‌రం ఇచ్చిన జ‌గ‌న్‌
X
రాజ‌న్న రాజ్యంలో ఎవ్వ‌రు దుఃఖంతో ఉండ‌రాదు.. ఆక‌లి అనే రాజ్యం లేకుండా చేయాల‌నే సంక‌ల్పంతో ముందుకు సాగుతున్నారు ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. రాజ‌న్న బిడ్డ‌ను నేను.. నేను విన్నాను.. నేను చూసాను.. నేను చేస్తాను.. అంటూ ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌ను ఒక్కొక్క‌టిగా అమ‌లు చేస్తూనే ముందుకు వెళుతున్నారు. తాను విన్న‌ది.. తాను క‌న్న‌ది.. తాను చేసుకుంటూ పోతున్న సీఎం జ‌గ‌న్ ఇప్పుడు మ‌రో వ‌ర్గానికి మేలు చేసే ప‌థ‌కానికి శ్రీ‌కారం చుట్టారు. ఏపీలో న‌వ‌ర‌త్నాలు అమ‌లు చేసే చ‌ర్య‌ల్లో భాగంగా నిరుద్యోగుల‌కు స్వ‌యం ఉపాధి క‌ల్పించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టారు.

అందుకే ఏపీలోని నిరుద్యోగ యువ‌త‌కు వైఎస్ ఆర్ ఆద‌ర్శం పేరుతో వివిధ కార్పోరేష‌న్‌ ల ద్వారా 6 వేల వాహ‌నాలు కోనుగోలుకు మార్గద‌ర్శకాలు విడుద‌ల చేసింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స‌ర్కార్. ఏపీలోని నిరుద్యోగ యువ‌త‌కు వివిధ బ్యాంకుల రుణాల ద్వారా స్వ‌యం ఉపాధి పొందేందుకు వాహ‌నాల‌ను కొనుగోలు చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. నిరుద్యోగ యువ‌తకు ఈ వాహ‌నాల‌ను అందిస్తే సొంతంగా వాహానాల‌ను న‌డుపుకుని త‌మ కుటుంబాల‌ను పెంచి పోషించుకునే అవ‌కాశం క‌ల్పిస్తుంది ప్రభుత్వం.

ఎస్సీ - ఎస్టీ - కాపు - బీసీ - మైనార్టీ - కార్పోరేష‌న్ల ద్వారా ఈ వాహనాలు అంద‌జేయ‌నుంది. సాంఘిక సంక్షేమ శాఖా కార్యద‌ర్శి నేతృత్వంలో 8 మంది స‌భ్యుల‌తో రాష్ట్ర స్థాయి క‌మిటీ ఏర్పాటు చేసింది. జిల్లాల్లో క‌లెక్టర్ల ఆధ్వర్యంలో ఏడుగురు స‌భ్యుల‌తో క‌మిటీ ఏర్పాటు చేయగా.. అర్హుల ఎంపిక - రుణాలు మంజూరు వ్యవ‌హారాలను ఈ క‌మిటీలు ప‌ర్యవేక్షించ‌నున్నాయి.. ఇప్పుడు ఏపీ ప్ర‌భుత్వం నిరుద్యోగుల సంక్షేమ కోసం స్వ‌యం ఉపాధి కోసం వైఎస్సార్ ఆద‌ర్శం పేరుతో అండ‌గా ఉండ‌నుంది. ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన మార్గ‌ద‌ర్శ‌కాల‌తో నిరుద్యోగ యువ‌త హ‌ర్షం వ్య‌క్తం చేస్తుంది.