దావోస్ కి వెళ్లి టీడీపీకి ఆయుధం ఇచ్చిన జగన్

Tue May 24 2022 15:00:19 GMT+0530 (IST)

Jagan About TDP in Davos

ఏ పని చేసినా కాజ్ ఒకటి ఉండాలి. కానీ మన సీఎం మాత్రం ఇందుకు భిన్నం అయి ఉన్నారా అన్న డౌట్ తెలుగుదేశం పార్టీది.



దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం మీటింగ్ లో కొన్ని ఆసక్తిదాయక పరిణామాలు చోటు చేసుకున్నాయి. విదేశీ పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా అక్కడికి వెళ్లిన జగన్ విషయమై కొన్ని విమర్శలు కూడా నమోదవుతున్నాయి. మహేంద్ర కంపెనీ ఓనర్ తోనూ అదానీ గ్రూపు అధినేతతోనూ మాట్లాడేందుకు దావోస్ కు ఎందుకు వెళ్లడం అని జోకులు వేస్తున్నారు టీడీపీ లీడర్లు.

వాళ్లంతా స్వదేశీయులే కదా! ఆ పాటి ఆలోచన లేకుండా  ఎలా ఉంటారని వాళ్లని కలవడం పెద్ద కష్టమేం కాదని భారత్ లో వాళ్లను ఎప్పుడయినా సరే కలిసి రావొచ్చని కూడా అంటున్నారు టీడీపీ లీడర్లు.

కానీ జగన్ మాత్రం వాళ్లతో చర్చలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం పలు ఆసక్తిదాయక విషయాలు రేకెత్తేందుకు సంబంధిత చర్చకు తావిస్తోంది. మన సీఎం కన్నా కేటీఆర్ చొరవే బాగుందని ఇంకొందరు సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు.

దావోస్ కు వెళ్లి అక్కడి ప్రతినిధి వర్గాలతో మాట్లాడడంలో కూడా జగన్ తడబడుతున్నారని అంటున్నాయి పసుపు పార్టీ వర్గాలు. ఆరోగ్యానికి జరిగిన కేటాయింపులు యూనియన్ బడ్జెట్ లోనే తగ్గాయి కదా మీరెలా ఆ పరిణామాన్ని అధిగమించారు అంటే జగన్ చెప్పిన సమాధానం అస్సలు కన్విన్సింగ్ గా లేదు.

జగన్ కొత్తగా మెడికల్ కాలేజీలు పెట్టామని చెప్పడం ఇంకా ఇర్రెలవెంట్.  ఆయన చెబుతున్న ప్రకారం ఆయన  చెప్పిన మెడికల్ కాలేజీలు ఏవీ ప్రారంభానికే నోచుకోలేదు. ఉన్న మెడికల్ కాలేజీల్లో కూడా  టీచింగ్ స్టాఫ్ లేదు. నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా కాంట్రాక్ట్ బేస్ మీద పనిచేస్తున్నారు. అలాంటప్పుడు జగన్ ఎలా ఇలాంటి అబద్ధాలు అంతర్జాతీయ వేదికపై చెబుతారని?  టీడీపీ నిలదీస్తోంది.