Begin typing your search above and press return to search.

ఓటీటీ లో 'జియో' ఎంట్రీ ఇస్తే... అవన్నీ సైడ్‌ అవ్వాల్సిందే

By:  Tupaki Desk   |   7 Feb 2023 11:42 AM GMT
ఓటీటీ లో జియో ఎంట్రీ ఇస్తే... అవన్నీ సైడ్‌ అవ్వాల్సిందే
X
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఎక్కడ అడుగు పెట్టినా కూడా అక్కడ అద్భుతాలు ఆవిష్కరించడం చూస్తూనే ఉన్నాం. ఇండియాలో ఈ స్థాయి డేటా వినియోగం పెరిగింది అంటే కచ్చితంగా రిలయన్స్ వారు తీసుకు వచ్చిన జియో అనే విషయం తెల్సిందే. దాదాపు ఏడాది పాటు ఫ్రీ గా డేటా ఇచ్చి అందరికి అలవాటు చేసిన జియో ఇప్పుడు పెద్ద ఎత్తున చార్జ్‌ లు వసూళ్లు చేస్తున్నారు.

జియో అడుగు పెట్టిన తర్వాత టెలికాం రంగం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు మొబైల్ డేటా 1 జీబీకి పదుల రూపాయల రేటు ఉండేది. కానీ ఇప్పుడు డేటా రేటు చాలా తగ్గింది. అలాగే వినియోగం వేల రెట్లు పెరిగింది. ఇప్పుడు రిలయన్స్ జియో ఓటీటీ రంగంలో అడుగు పెట్టబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

జియో ను ప్రారంభించిన సమయంలోనే జియో సినిమా అంటూ ఓటీటీని తీసుకు వచ్చారు కానీ కొన్ని కారణాల వల్ల పూర్తి స్థాయి ఓటీటీ గా జియో ఓటీటీ రూపాంతరం చెందలేదు.. అలాగే గుర్తింపు సొంతం చేసుకోలేదు. అందుకే జియో ను పూర్తి స్థాయి ఓటీటీ మార్కెట్‌ లోకి దించాలనే ఉద్దేశ్యంతో రిలయన్స్ అధినేతలు ప్లాన్‌ చేస్తున్నారట.

అందుకే ఇప్పటికే ఉత్తరాదిన మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న వూట్ ఓటీటీని జియో కొనుగోలు చేసిందట. అంతే కాకుండా ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాణ సంస్థ వయోకామ్ 18 స్టూడియోస్ ను కూడా కొనుగోలు చేసింది. ఇదంతా కూడా ఓటీటీని విస్తరించేందుకు అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

జియో వూట్ అంటూ కొత్త ఓటీటీని అతి త్వరలోనే మార్కెట్‌ లోకి తీసుకు వచ్చి అన్ని భాషల్లో సిరీస్ లు మరియు కోట్ల రూపాయలు పెట్టి కొత్త సినిమాలను ప్రేక్షకులకు అందించబోతున్నట్లుగా తెలుస్తోంది. జియో ను అలవాటు చేసినట్లుగా జియో వూట్ ను మొదట ఫ్రీ గా ఇచ్చి.. అలవాటు అయిన తర్వాత నామ మాత్రపు రేటు నిర్ణయించి కొన్నాళ్ల పాటు భారీ ఎత్తున రేటు పెంచే యోచన చేసే అవకాశాలు ఉన్నాయి.

ప్రస్తుతం ఓటీటీ రంగంలో అగ్రగామిగా ఉన్న అమెజాన్‌.. నెట్‌ ఫ్లిక్స్.. డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌.. ఆహా.. సోనీ లివ్ లు జియో అడుగు పెడితే కచ్చితంగా సైడ్ అవ్వాల్సిందే అనేది మార్కెట్‌ వర్గాల మాట. జియో ఓటీటీ విషయమై త్వరలో క్లారిటీ వస్తుందేమో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.