బిజినెస్ కొంతకాలం ఆపేస్తానంటూ జేసీ సంచలన ప్రకటన

Fri Nov 15 2019 16:50:34 GMT+0530 (IST)

JC Sensational News About His Business

భరోసాగా మాట్లాడటం.. తామేం చేసినా చెల్లిపోతుందన్నట్లుగా వ్యవహరించటంతో పాటు.. దిలాసాకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే మాజీ ఎంపీ.. టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి నోట ఊహించినరీతిలో వచ్చిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలో ప్రతీకారవాంఛ ఎక్కువైందని.. ప్రత్యర్థుల్ని హింసిస్తున్నారన్నారు. ఏదో రకంగా కేసులు పెట్టి వేధించాలన్న ఆలోచన అంతకంతకూ పెరుగుతోందని.. అందుకే తమ ట్రావెల్ బిజినెస్ ను కొంతకాలం ఆపేయాలని తాము అనుకుంటున్నట్లు చెప్పారు.బస్సులు.. ఇతర ఆస్తుల విషయంలో తనపైన అనేక ఒత్తిళ్లు తీసుకొస్తున్నారని.. అధికారుల మీద ఎదురు కేసులు వేయటం మొదలు పెట్టగానే.. వారు కాళ్ల బేరానికి వస్తున్నట్లు చెప్పారు. తమపై వాళ్లు ఒత్తిడితోనే తాము కేసులు పెడుతున్నట్లు జేసీ వెల్లడించారు. రోజూ కేసుల గొడవ ఎందుకన్న ఉద్దేశంతో కొంతకాలం ట్రావెల్స్ బిజినెస్ ను ఆపేయాలని తాము అనుకుంటున్నట్లు చెప్పారు.

నాలుగు రోజులు జైల్లో పెట్టినా ఫర్లేదని ధైర్యంగా నిలబడితే పోయేదేముందని వ్యాఖ్యానించిన జేసీ.. తనపై ఒత్తిళ్లు పెరుగుతున్నట్లు చెప్పారు. టీడీపీ నుంచి ఇతర పార్టీల్లోకి వెళ్లి చేరేవారు ఏదో ఒక మాట అనటం.. ఆరోపణలు చేయటం మామూలే అన్నారు.