Begin typing your search above and press return to search.

ఆ రెండు కుటుంబాలనూ బీజేపీ తిప్పుకుంటుందా?

By:  Tupaki Desk   |   20 Jun 2019 1:30 AM GMT
ఆ రెండు కుటుంబాలనూ బీజేపీ తిప్పుకుంటుందా?
X
ఏపీలో తెలుగుదేశం పార్టీ చిత్తు అయ్యాకా పలువురు నేతలు బీజేపీ వైపు చూస్తున్నారనే వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చి నెల కావొస్తున్నా అవి ఇంకా గాసిప్స్ గానే ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఈ జాబితాలో రకరకాల పేర్లు వినిపిస్తూ ఉన్నాయి.

కొందరి పేర్లు పదే పదే వినిపిస్తూ ఉన్నాయి. అయితే చేరికల వ్యవహారం మాత్రం క్లారిటీ రావడం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రముఖంగా రెండు రాజకీయ కుటుంబాల పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. వారు తెలుగుదేశం పార్టీని వీడి బీజేపీలోకి చేరడానికి రెడీ అంటున్నారట.

రాయలసీమ ప్రాంతానికి చెందిన తెలుగుదేశంలో ఉన్న ఆ రెండు కుటుంబాలే జేసీ - కేఈ. తెలుగుదేశం పార్టీలో చాలా కాలంగా ఉన్న ఫ్యామిలీ కేఈ కుటుంబం. ఐదేళ్ల కిందట తెలుగుదేశంలో చేరింది జేసీ కుటుంబం.

ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఓడిపోవడంతో పాటు.. ఈ రాజకీయ కుటుంబాలు కూడా ఓటమిని ఎదుర్కొన్నాయి. కేఈ కుటుంబం నుంచి పోటీ చేసిన వాళ్లంతా ఓడిపోయారు. జేసీ ఫ్యామిలీకీ జనాలు అదే తరహా సమాధానం ఇచ్చారు.

ఇలాంటి క్రమంలో వీళ్లు బీజేపీ వైపు చూస్తున్నారని సమాచారం. తాము రాజకీయ సన్యాసం తీసుకున్నట్టే అని జేసీ దివాకర్ రెడ్డి, కేఈ కృష్ణమూర్తి ప్రకటించారు. అయితే వారి వారసుల రాజకీయ భవితవ్యం పెండింగ్ లో ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీలో చేరి అటు జేసీ వారసులు - ఇటు కేఈ వారసులు రాజకీయ భవితవ్యాన్ని పొందాలని చూస్తున్నట్టుగా సమాచారం. మరి వీరు ఇప్పుడు పార్టీ మారినంత మాత్రాన అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఏ మాత్రం బేస్ మెంట్ లేని బీజేపీ బలోపేతం అయిపోతుందా?