Begin typing your search above and press return to search.

అమెరికా తర్వాత ఆ స్థానం ఇండియాదే : ట్రంప్

By:  Tupaki Desk   |   11 Aug 2020 6:45 AM GMT
అమెరికా తర్వాత ఆ స్థానం ఇండియాదే : ట్రంప్
X
కరోనా వైరస్ మహమ్మారి ..ప్రస్తుతం ప్రపంచంలో ప్రతి దేశాన్ని వణికిపోయేలా చేస్తుంది. చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ కరోనా వైరస్ , ఆ తర్వాత చైనా లో కంటే చైనా వెలుపలి దేశాల్లోనే ఎక్కువగా ప్రభావం చూపింది. ముఖ్యంగా కరోనా ప్రభావం ఎక్కువగా పడిన దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా పేరొందిన అమెరికా కూడా కరోనా వైరస్ దెబ్బకి వణికిపోతోంది. దాదాపుగా ప్రపంచంలో నమోదు అయిన కరోనా కేసుల్లో దాదాపుగా సగం కేసులు అమెరికాలోనే నమోదు అయ్యాయి. ఇకపోతే తాజాగా అధినేత ట్రంప్ మాట్లాడుతూ .. కరోనావైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడంలో అమెరికా ప్రథమ స్థానంలో ఉందని , ఆ తర్వాతి స్థానం భారత్‌ దేనని ‌ తెలిపారు.

కరోనా‌ టెస్టుల్లో అమెరికాకు దరిదాపుల్లో మరేదేశం లేదని ఆయన స్పష్టం చేశారు. భారత్‌ రెండో స్థానంలో ఉన్నప్పటికీ కూడా అది అమెరికాను మించలేదన్నారు. తాజాగా అయన మాట్లాడుతూ .. అమెరికాలో ఇప్పటి వరకు 65 మిలియన్ల కరోనా‌ టెస్టులు నిర్వహించాం. ఇదే ప్రపంచంలో అత్యధికం. ఆ తర్వాత 150 కోట్ల జనభా ఉన్న భారత్‌ లో 11 మిలియన్ల టెస్టులు నిర్వహిచి రెండో స్థానంలో ఉంది. ప్రపంచలో ఏ దేశం నిర్వహించలేనన్ని నాణ్యమైన టెస్టులను అమెరికా నిర్వహించింది. ఈ విషయంలో అమెరికాను ఏ దేశం అందుకోలేదు అని ట్రంప్‌ ,అలాగే ఈ ఏడాది చివరి నాటికి కరోనా వ్యాక్సిన్‌ను తీసుకొస్తామని ట్రంప్‌ స్పష్టం చేశారు. అమెరికాలో గత వారం రోజులుగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తుందని తెలిపారు.

ఇకపోతే , దేశ వ్యాప్తంగా గత వారం రోజులుగా 14శాతం మేర కేసులు తగ్గాయన్నారు. ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య 7 శాతం, మరణాలు 9శాతం తగ్గాయని ట్రంప్‌ వెల్లడించారు. కాగా, అమెరికాలో ఇప్పటివరకు 5,251,446 మందికి కరోనా బారిన పడగా, 166,192 మంది మరణించారు. ఇక భారత్ ‌లో కరోనా బాధితుల సంఖ్య 2,269,052 కు చేరింది. ఈ మహమ్మారి పడి ఇప్పటి వరకు 45,361 మంది ప్రాణాలు కోల్పోయారు.