Begin typing your search above and press return to search.

కోహ్లీ సెక్స్ యాంగిల్స్‌..మ‌హిళ ర‌చ‌యిత్రి ప‌బ్లిక్‌ గా...

By:  Tupaki Desk   |   18 Jan 2020 5:30 PM GMT
కోహ్లీ సెక్స్ యాంగిల్స్‌..మ‌హిళ ర‌చ‌యిత్రి ప‌బ్లిక్‌ గా...
X
వాంఖెడే స్టేడియంలో తొలివన్డేలో భారత్‌ - ఆస్ట్రేలియా తలపడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ 10 వికెట్లతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. రాజ్‌ కోట్ వేదికగా జరిగిన రెండో వన్డేలో టీమిండియా విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేపట్టిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసింది. అనంతరం 341 రన్స్‌ విజయలక్ష్యంతో బ్యాటింగ్‌ బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 49.1 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌట్‌ అయింది. 36 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై భారత్‌ గెలుపొందింది. అయితే, ఈ గెలుపు ఓట‌ముల‌ను ఓ ర‌చయిత్రి శృంగార భంగిమ‌ల‌తో పోల్చింది. కోహ్లీ-ఆయ‌న భార్య‌ను వాటిల్లోకి లాగి త‌న పైత్యాన్ని చాటుకుంది.

మ్యాచ్‌ ల‌లో మూడోస్థానంలో బ్యాటింగ్‌ కు వచ్చే విరాట్ కోహ్లీ తొలి వన్డేలో నాలుగో స్థానంలో బరిలోకి దిగాడు. అయితే, ఇండియా ఘోర‌ప‌రాజ‌యం పాలైంది. రెండో వ‌న్డేలో ప్రయోగాల జోలికి పోకుండా వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌ కు వచ్చిన కోహ్లీ తన క్లాస్‌ చాటడంతో భారత ఇన్నింగ్స్‌ సజావుగా సాగింది. విజ‌యం సాధించింది. దీనిపై ప్ర‌ముఖ రచయిత్రి భావనా అరోరా స్పందిస్తూ, ``విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియన్లతో సరికొత్త పొజిషన్ల కోసం ప్ర‌యత్నిస్తూ తనతో మాత్రం ఆ పని చేయకపోవడంపై అనుష్క ఆగ్రహంతో ఉంది`` అంటూ బూతు ట్వీట్ చేసింది. జ‌ట్టు కోసం కోహ్లీ చేసిన ప్ర‌య‌త్నాన్ని ఇలా వెక్కిరించింది.

అయితే, ఈ బూతు భావాల ర‌చ‌యిత్రికి నెటిజ‌న్లు స‌రైన షాకే ఇచ్చారు. ``నీకు అలాంటి పొజిష‌న్ల గురించి చాలా కోరిక‌గా ఉంది. కానీ నేను అక్క‌డ లేను క‌దా?`` అంటూ ఓ నెటిజ‌న్ మొహంపై చెప్పుతో కొట్టిన‌ట్లు ఆ ర‌చ‌యిత్రికి షాకిచ్చాడు. `కోహ్లీ కొత్త పోజిషన్లను ట్రై చేయడం లేదంటూ అనుష్క శర్మ నీకు మెసేజ్ చేసిందా?` అంటూ ఓ నెటిజ‌న్ ప్ర‌శ్నించాడు. ``భావన అరోరాకు మతి చెడిపోయింది, ఆమెను గంగలో ముంచింది`అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు.