Begin typing your search above and press return to search.

వ్యాక్సినేషన్ కేంద్రాల్లో నిఘా ... కేంద్రం కీలక ఆదేశాలు, టీకా తీసుకున్న తర్వాత అలా చేయాల్సిందే ?

By:  Tupaki Desk   |   16 Jan 2021 8:33 AM GMT
వ్యాక్సినేషన్ కేంద్రాల్లో నిఘా ... కేంద్రం కీలక ఆదేశాలు, టీకా తీసుకున్న తర్వాత అలా చేయాల్సిందే ?
X
శనివారం ఉదయం 10.30 గంటలకు ఈ కరోనా టీకా పంపిణి కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టే 3,006 కేంద్రాల్లో అనేక జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం, ఆరోగ్య శాఖ అధికారులు ప్రజలకు, టీకాలు వేస్తున్న ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేసింది. వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ఈ సూచనలు, సలహాలు కచ్చితంగా పాటించాలని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. వాటిని ఒకసారి చూస్తే....కరోనా వైరస్ మహమ్మారి నుంచి ప్రాణాలు కాపాడుకోవాలని ప్రపంచ దేశాల ప్రజలు భావిస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ ను ప్రజలు ధైర్యంగా వేసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. కరోనా వ్యాక్సిన్ పంపిణితో నేడు భారతదేశం సత్తా ప్రపంచానికి తెలిసింది. కరోనా వ్యాక్సిన్ వేసుకున్న ప్రతి ఒక్కరు తరువాత గంట సేపు కచ్చితంగా విశ్రాంతి తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కనీసం గంటసేపు విశ్రాంతి తీసుకుంటే వారి దేహంలో ఆ టీకా ప్రభావం చూపుతుందని, టీకా ప్రభావం కచ్చితంగా శరీరంలో చూపిస్తుందని ఆరోగ్య శాఖ అధికారులు అంటున్నారు.

కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న అన్ని కేంద్రాల్లో అనేక నియమాలు పాటించాలని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న అన్ని కేంద్రాల్లో, పరిసర ప్రాంతాల్లో ప్రతిఒక్కరూ కచ్చితంగా ముఖాలకు మాస్క్ లు వేసుకోవాలని, ఎప్పటికప్పుడు శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకోవాలని, భౌతికదూరం పాటించాలని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది.భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలు ఎప్పుడెప్పుడు కరోనా వ్యాక్సిన్ వస్తుందా అని ఇంతకాలం ఎదురు చూసింది. ఆ శుభముహూర్తానికి నేడు ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు.