Begin typing your search above and press return to search.

అంబటికి కుంపటి పెట్టిన సొంత పార్టీ నేతలు

By:  Tupaki Desk   |   28 Jan 2023 1:26 PM GMT
అంబటికి కుంపటి పెట్టిన సొంత పార్టీ నేతలు
X
ఏపీలో మంచి మాటకారిగా, వైసీపీ ప్రభుత్వంలో కీలకమైన జలవనరుల శాఖ మంత్రిగా ఉన్న అంబటి రాంబాబుకు సొంత పార్టీలోనే కుంపటి పెడుతున్నారు నాయకులు. దానికి కారణం తమను అసలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని, తనకు సన్నిహితులైన వారికే దగ్గరకు తీస్తున్నారని. ఈ విషయాన్ని బాహాటంగానే అడిగేసి కడిగేస్తున్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలమం పెదమక్కేన ఎంపీటీసీ సభ్యురాలు మేకపాటి విజయకుమారి అంబటి వ్యవహార శైలి మీద తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

మంత్రి గారికి తాము ఇపుడు ఎందుకు కనిపించడం లేదు అని నిలదీశారు. గణతంత్ర వేడుకల సందర్భంగా ఆమె పెదమక్కెన జెడ్పీ పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి వచ్చిన విజయకుమారి అక్కడ హెచ్ ఎం వనజకుమారి మీదనే నేరుగా విమర్శలకు దిగారు, ఈ మధ్య జరిగిన ట్యాబుల పంపిణీ కార్యక్రమానికి తమను ఎందుకు పిలవలేదని సూటిగా ప్రశించారు.

మంత్రి అంబటికి సన్నిహితులైన పురుషోత్తం, విజయభాస్కరరెడ్డిలకు పిలిస్తే సరిపోతుందా, మేము ఎవరికీ కనిపించడంలేదా అని ఫైర్ అయ్యారు. ఆనాడు మా ఇళ్ళ వద్దకు వచ్చి ఎన్నికలలో గెలుపు కోసం ఓట్ల కోసం తెగ తిరిగారని, ఇపుడు మాత్రం తాము కళ్ళకు కనిపించడంలేదా అని ఆమె ఒక దుమ్ము దులిపేశారు. మంత్రి సైతం ఈ విధంగా వ్యవహరించడం ఏమీ బాగులేదని అన్నారు.

తాము కూడా ఈసారి ఆయన ఎలా గెలుస్తారో చూస్తామని ఎంపీటీసీ గట్టిగానే మాట్లాడారు. మంత్రి సన్నిహితులైన ఆ ఇద్దరే గెలిపిస్తారు అని ఆమె రుసరుసలాడారు. ఏ ముఖం పెట్టుకుని మళ్లీ తమ వద్దకు వస్తారని కూడా ఆమె ప్రశ్నించారు. తాను వీళ్ళందరికీ ఎన్నికల వేళ వండి వార్చానని, తన శక్తిని అంతా ధారోపోశాని అయినా విశ్వాసం లేదని విజయకుమారి మండిపడ్డారు

తమ ఇళ్ల చుట్టూ ఒకనాడు తిరిగిన వారికి ఇపుడు అధికారం చేతులలోకి రాగానే ఏమీ కనిపించడంలేదా అని ఎంపీటీసీ భర్త కోటి రెడ్డి కూడా గట్టిగా తగులుకున్నారు. ఇక ఎంపీటీసీ అయితే కుక్కలు అంటూ అనుచితమైన భాష వాడేసి మరీ అనాల్సిన నాలుగు జాడించి వదిలిపెట్టారు. దాంతో లోకల్ గా ఉన్న ఇద్దరు నేతలతో పాటు మంత్రి అంబటికి కూడా గట్టిగా కుప్మటి పెట్టినట్లు అయింది.

అసలే అంబటికి సత్తెనపల్లి చుక్కలు చూపించే సీటుగా ఉంది అని అంటున్నారు. దాంతో ఇపుడు ఆ సీటులో సైతం విభేధాలు రావడం, సొంత పార్టీ వారే బజారు కెక్కి పరువు తీయడం లో సత్తెనపల్లిలో అంబటికి ఇక్కట్లు తప్పవా అని అంటున్నారు ఇక తమకు ఏ మాత్రం మంత్రి గారు పట్టించుకోవడం లేదని ఏ ముఖం పెట్టుకుని ఓట్లకు ఇటు వైపు వస్తారు అన్న డైలాగులు మాత్రం పవర్ ఫుల్ గానే ఉన్నాయి. ఇవన్నీ ఏకంగా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మంత్రి గారి పరువుకే సమస్య వచ్చినట్లుగా ఉంది అని అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.