Begin typing your search above and press return to search.

ఇజ్రాయెల్ వైమానిక దాడులతో అదిరిపోయిన గాజాసిటీ !

By:  Tupaki Desk   |   16 Jun 2021 8:32 AM GMT
ఇజ్రాయెల్ వైమానిక దాడులతో అదిరిపోయిన గాజాసిటీ !
X
గాజాసిటీ పై ఇజ్రాయెల్ మరోసారి వైమానిక దాడులు చేయడం మొదలుపెట్టింది. ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతాలపై పాలస్తీనా పేలుడు పదార్థాలతో కూడిన బెలూన్లను ప్రయోగించడంతో ఇజ్రాయెల్ కూడా ప్రతీకారానికి దిగింది. ఉభయ పక్షాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కొద్ది రోజుల తరువాత మొదటిసారిగా తిరిగి వీటి మధ్య పోరు ప్రారంభమైంది. మంగళవారం తూర్పు జెరూసలెంలో ఇజాయెలీలు భారీ ప్రదర్శన నిర్వహించడాన్ని హమాస్ ఉగ్రవాదులు తీవ్రంగా వ్యతిరేకించారు. పైగా ఆ సందర్బంగా హమాస్ కాంపౌండ్స్(శిబిరాలపై) ఇజ్రాయెల్ సైన్యం దాడులకు పాల్పడింది.

గాజాలో ఉగ్రవాద చర్యలు కొనసాగుతూనే ఉన్న పక్షంలో తాము కూడా సహించేది లేదని సైన్యం హెచ్చరించింది. దీంతో రెండు పక్షాల మధ్య ఉద్రిక్తతలు మళ్ళీ రేగాయి. గాజా సిటీ నుంచి హమాస్ టెర్రరిస్టులు రాకెట్లను ప్రయోగించడంతో.. ఇజ్రాయెల్ పాలస్తీనాలోని ప్రధాన నగరాలను టార్గెట్లుగా చేసుకుని వైమానిక దాడులు చేసింది. ఇజ్రాయెల్ లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం తిరిగి మొదటిసారిగా వీటి మధ్య వైషమ్యాలు తలెత్తాయి. గత మే 21 న వీటి మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయితే అది ఎంతోకాలం కొనసాగలేదు. అంతకుముందు జరిగిన పోరులో 250 మంది పాలస్తీనీయులు మరణించారు. వీరిలో 66 మంది పిల్లలు కూడా ఉన్నారు. హమాస్ దాడుల్లో 5 ఏళ్ళ బాలుడితో సహా 13 మంది ఇజ్రాయెలీలు మృతి చెందారు.

వీటి మధ్య తిరిగి తలెత్తిన పోరుపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉండాలని కోరింది. ఇజ్రాయెల్ కొత్త ప్రధానిగా బెనెట్ పదవి స్వీకరించిన మరునాడే ఈ ‘యుద్ధ మేఘాలు’ ఆవరించడం విశేషం. అంతకు ముందు మంగళవారం యూదు జాతీయవాదులు ఇజ్రాయెల్ అధీనంలోని తూర్పు జెరూసలెంలో ఒక ఊరేగింపు నిర్వహించారు. తర్వాత గాజాలో పాలన సాగిస్తున్న మిలిటెంట్ గ్రూప్‌ హమాస్ నుంచి బెదిరింపులు వచ్చాయి.