షాకింగ్: యాక్సిడెంట్ లో మరణించిన యువ నటి

Wed Sep 22 2021 10:02:52 GMT+0530 (IST)

young actress who died in an accident

ప్రియుడితో కలిసి కలిసి హాలీడే ట్రిప్ కు వెళ్లిన యువ హీరోయిన్ ఈశ్వరి దేశ్ పాండే ఆ యాత్రను విషాదంతో ముగించింది. ఎంతో ఎంజాయ్ మెంట్ కోసం వెళ్లిన ఆమె కానరాని లోకాలకు వెళ్లిపోయింది. కారు ప్రమాదంలో మృతిచెందింది.మరాఠీ యువ హీరోయిన్ ఈశ్వరి దేశ్ పాండే తన ప్రియుడితో కలిసి సెప్టెంబర్ 15న గోవా హాలీడే ట్రిప్ కు వెళ్లింది. సోమవారం తెల్లవారుజామున వీరు ప్రయాణిస్తున్న కారు అర్ఫారో గ్రామానికి సమీపంలో బాగా-కలాంగుట్ వంతెనపై అదుపుతప్పి లోయలోకి పడిపోయింది.

కారు సెంట్రల్ లాక్ చేసి ఉండడంతో ఇద్దరూ కారులోంచి బయటకు రాలేకపోయారు. ఈ ప్రమాదంతో హీరోయిన్ ఈశ్వరి(25)తోపాటు ఆమె ప్రియుడు శుభమ్ డెడ్జ్ (28) కూడా ప్రాణాలు కోల్పోయారు.

చిన్నప్పటి నుంచి నటిగా రాణించాలని కలలుగన్న ఈశ్వరిదేశ్ పాండే పలు హిందీ మరాఠీ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆమె సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండగా హీరోయిన్ ప్రాణాలు కోల్పోవడం విషాదం నింపింది.

ఇక శుభమ్ తో ఈశ్వరికి చాలా రోజులుగా పరిచయం ఉంది. వీరి స్నేహం ఇటీవలే ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో వీరి నిశ్చితార్థానికి కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కారు ప్రమాదం రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది.

ట్రిప్ కు వెళ్లి సంతోషంగా తిరిగి వస్తారనుకుంటే శవమై తేలడంతో బంధువులు స్నేహితులు షాక్ కు గురయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.