వయసుకొచ్చిన పెళ్లిచేసుకోనిది ఇందుకేనట?

Thu Jun 10 2021 09:16:15 GMT+0530 (IST)

Is this why the elderly are unmarried?

ఈ కాలంలో పెళ్లిళ్లు మరీ లేట్ అయిపోయితున్నాయి. 30 దాటనిదే అబ్బాయిలు పెళ్లి మాట ఎత్తడం లేదు. చదువులు ఉద్యోగాల వేట పడి అది సాధించేసరికే మూడు పదులు దాటుతున్నాయి. ఇక అప్పుడు పిల్లను చూసి చేసుకునేసరికి మరింత ఆలస్యం అవుతోంది. అయితే తప్పదు కాబట్టి చాలా మంది ఏజ్ ముదురుతుందని.. పిల్లను ఎవ్వరూ ఇవ్వరని చేసేసుకుంటున్నారు.కొంత మంది పురుషులకు వయసు అయిపోయినప్పటికీ వివాహం మాత్రమే సమస్య కాదు.. ఇతర కారణాలు కూడా ఉన్నాయి. ఇతర దేశాల్లో 35 ఏళ్ల వయసులో 6వేలకు పైగా ఒంటరి పురుషులను సర్వే చేశారు. వారు అన్నిఏళ్లు వచ్చి ఎందుకు పెళ్లి చేసుకోలేదని ప్రశ్నించారు. కొందరు తాను అందంగా లేనని పెళ్లి చేసుకోలేదన్నారు. ఇక మరొకరు తల వెంట్రుకలు రాలిపోయి బట్టతల వచ్చిందన్నారు. ఇంకొందరు ఎత్తు లేమని పెళ్లి చేసుకోలేదని చెప్పుకొచ్చారు.

ఇక ఉద్యోగం లేకపోవడం.. సెటిల్ కాకపోవడం.. భార్య పిల్లలను పోషించే స్థోమత లేక చాలా మంది వివాహం చేసుకోవడం లేదని తేలింది. ఇక సరైన భార్యను/భర్తను ఎంపిక చేసుకునే మానసిక స్థితి లేక కొందరు చేసుకోవడం లేదు. జీవిత భాగస్వామిని ఎంచుకొని వారితో మంచి సంబంధాలు కొనసాగించడం కష్టమని భావించే పురుషులు భాగస్వామిని కనుగొనలేకపోతున్నారు. ఇక వివాహేతర సంబంధాలు ఎఫైర్ల గోలతో తమ కాపురాలకు ఎక్కడ కూలుతాయోనన్న భయంతో కొందరు చేసుకోవడం లేదని తేలింది.

మితిమీరిన సిగ్గు కుటుంబ నేపథ్యంలో అమ్మాయిలతో ఎలా వ్యవహరించాలో తెలియక కొంత మంది వివాహ బంధంలోకి అడుగుపెట్టడం లేదని తేలింది.