Begin typing your search above and press return to search.

ధర తగ్గించినా సరే రెమిడెసివిర్ వైట్ మార్కెట్ లో దొరుకుతుందా?

By:  Tupaki Desk   |   18 April 2021 9:30 AM GMT
ధర తగ్గించినా సరే రెమిడెసివిర్ వైట్ మార్కెట్ లో దొరుకుతుందా?
X
దేశంలో సెకండ్ వేవ్ వచ్చేసింది. కరోనా కల్లోలం చోటుచేసుకుంటోంది. ఆస్పత్రులన్నీ రోగులతో నిండిపోతున్నాయి. బెడ్స్ అన్నీ ఫిల్ అయ్యి ఒక్క బెడ్ కూడా ఆస్పత్రుల్లో దొరకని పరిస్థితి. ఆక్సిజన్ కొరతతో రోగుల ప్రాణాలు పోతున్నాయి.

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ బెడ్ల కొరత ఏర్పడటం.. మెడికల్ గ్రిడ్ ఆక్సిజన్ కొరత ఉందంటూ రాష్ట్రాలన్నీ కేంద్రానికి మొర పెట్టుకుంటున్నాయి.

ఇంతలోనే పిడుగుపాటులాగా వ్యాక్సిన కొరత అంశం తెరపైకి వచ్చింది. టీకా ఉత్పత్తి దిగ్గజాలైన సీరం సంస్థ చేతులెత్తేసింది. దీంతో దేశ ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

ఇక కోవిడ్ వ్యాక్సిన్ కు ప్రత్యామ్మాయంగా వాడుతున్న యాంటి వైరల్ ఇంజక్షన్ రెమిడెసివిర్ కు మార్కెట్లో భారీ డిమాండ్ ఏర్పడింది. కోవిడ్ ను తగ్గించే ఈ ఇంజెక్షన్లను ఆస్పత్రుల నుంచి దొంగతనం చేసే దుస్తితి నెలకొంది.

దీంతో వెంటనే కేంద్రం రంగంలోకి దిగి రెమెడిసివిర్ ఇంజక్షన్ ధరను భారీగా తగ్గించింది. ఇప్పటిదాకా రూ.3వేలు ఉన్న ధర.. ఇప్పుడు రూ.899కు తగ్గించారు.

అయితే ఎంత తగ్గించినా కూడా రెమెడిసివిర్ ఇంజెక్షన్ లు బ్లాక్ మార్కెట్ కు తరలిపోయాయి. ఇవీ మెడికల్ షాపులు సహా ఆస్పత్రుల్లో దొరకడం లేదు. బయట ఒక్కోటి రూ.10వేల నుంచి 50వేల వరకు డిమాండ్ ను బట్టి అమ్మేస్తున్నారు. కేంద్రం ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా కూడా డిమాండ్ అధికంగా ఉండడంతో రోగుల అవకాశాన్ని మెడికల్ దళారులు సొమ్ముచేసుకుంటున్నారు.