భూమి అంతరించి పోవడం ఖాయం.. ! ఇది జోస్యం కాదు.. శాస్త్రవేత్తల మాట..!

Sat Mar 06 2021 20:00:01 GMT+0530 (IST)

Is the earth running out of oxygen?

ఇప్పటికే భూమి మీద ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది. మనదేశంలోని కొన్ని నగరాల్లో కూడా ఆక్సిజన్ను కొనుక్కొనే పరిస్థితి వచ్చిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అయితే భవిష్యత్లో ఆక్సిజన్ శాతం మరింత తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇప్పటికే ఆక్సిజన్ సిలిండర్లు కొనుక్కుంటున్నారు. భవిష్యత్లో ఆక్సిజన్ సిలిండర్లు కూడా అందుబాటులో ఉండవని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. భవిష్యత్ లో వాతావరణంలో ఆక్సిజన్ శాతం మొత్తం తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వెరసి ఏ జీవరాశి భూమి మీద జీవించలేదని శాస్త్రవేత్తలు అంటున్నారు.టోక్యో విశ్వవిద్యాలయానికి చెందిన కజుమి ఓజాకి జార్జియా టెక్‌కు చెందిన క్రిస్ రీన్‌హార్డ్ నిర్వహించిన రీసెర్చ్‌లో సంచలన విషయాలు బయటపడ్డాయి. మరో 10 వేల సంవత్సరాలు గడిచిన తర్వాత భూమిపై అసలు ఆక్సీజన్ అనేది ఉండదని వీళ్ల పరిశోధనలో తేలింది.సౌర వ్యవస్థ దాని జీవిత చక్రాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఒక బిలియన్ సంవత్సరాల్లో  సూర్యుడు వేడెక్కుతాడని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దాని వల్ల వాతావరణం వేడెక్కి గాలిలోని కార్బన్ డయాక్సైడ్ విచ్ఛిన్నం అవుతుందని చెబుతున్నారు.

దీని వల్ల గాలిలో కార్బన్ డయాక్సైడ్ తగ్గుతుందని దాంతో చెట్లకు కార్బన్ డయాక్సైడ్ లభించక చనిపోతాయని అంచనా వేశారు. చెట్లు అంతరించి జీవరాశికి ఆక్సిజన్ అందక అవి కూడా అంతరించిపోతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. పర్యావరణాన్ని కాపాడుకుంటే తప్ప జీవరాశికి మనుగడ ఉండదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణపై ఇప్పటికే పలు దేశాలు నడుం బిగించాయి.

మనదేశంలో సైతం ఆయా  రాష్ట్రప్రభుత్వాలు పర్యావరణ పరిరక్షణ చేపడుతున్నాయి. మొక్కలు నాటడం.. వాటిని పెంచడం తదితర కార్యక్రమాలు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయి. ఆక్సిజన్ కొరత లేకుండా చూసుకోవాలంటే మొక్కలను పెంచడం ఒక్కటే మార్గమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా మనమంతా మేల్కొనాలని సూచిస్తున్నారు.