Begin typing your search above and press return to search.

ఢిల్లీ సీఎం గ్వాలియర్ లో చాట్ అమ్ముతున్నారా?

By:  Tupaki Desk   |   15 Oct 2021 5:30 AM GMT
ఢిల్లీ సీఎం గ్వాలియర్ లో చాట్ అమ్ముతున్నారా?
X
మనిషిని పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగురు ఉంటారంటారు. అందులో నిజం ఎంతన్నది చెప్పలేం కానీ.. కొన్నిసార్లు కొంతమంది ప్రముఖుల్ని పోలినట్లు ఉండేటోళ్లు కనిపిస్తూ ఉండటం తెలిసిందే. తాజాగా అలాంటి సిత్రమే బయటకువచ్చింది. ఒక ఫుడ్ బ్లాగర్ పుణ్యమా అని.. మోపెడ్ మీద ఛాట్ బండార్ నిర్వహించే చిరువ్యాపారి ఒకరు అచ్చం ఢిల్లీ సీఎంలా ఉండటం ఆసక్తికరంగా మారింది.

ఫోటో చూసినంతనే ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాదిరి కనిపించే ఈయన పేరు గుప్తా. చాట్ బండార్ వ్యాపారాన్ని నిర్వహిస్తుంటారు. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లోని మోతీ మహల్ దగ్గర బండి మీద ఛాట్ సమోసా.. గులాబ్ జామూన్.. పాపిడి ఛాట్.. తదితరాల్ని అమ్మే ఆయన అచ్చుగుద్దినట్లు ఢిల్లీ సీఎం మాదిరే కనిపిస్తారు. ఈ విషయం తాజాగా బయటకు వచ్చి.. ఈ గ్వాలియర్ ఛాట్ వాలా ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చాయన్న విషయానికి వస్తే.. ఫుడ్ బ్లాగర్ కరణ్ దువా పుణ్యమేనని చెప్పాలి. ఆయనకు చెందిన ‘దిల్ సే ఫుడీ’ పేరిట ఒక యూట్యూబ్ చానల్ నిర్వహిస్తున్నారు. ఇందులో ఛాట్ వాలా గుప్తాను పరిచయం చేయటంతో ఆయన.. ఇప్పుడు ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. చాలామంది తనను ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మాదిరి ఉన్నావని.. దగ్గర పోలికలతో ఉన్నట్లు చెబుతారని గుప్తా ఆనందంగా వెల్లడించారు.
చలికాలంలో మఫ్లర్ ధరిస్తే.. ఢిల్లీ సీఎంలానే ఉంటారంటారన్న ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపు రెండు లక్షల మంది వరకు చూశారు. చూసిన వారిలో ఎక్కువమంది.. ఢిల్లీ సీఎం.. ఈ గ్వాలియర్ ఛాట్ మ్యాన్లు ఇద్దరు ఒక్కసారైనా కలుసుకోవాలని కోరుకోవటం విశేషం. మరి.. ఇందుకు ఢిల్లీ సీఎం ఎలా రియాక్టు అవుతారు.