బెజవాడ అగ్నిప్రమాదం వెనుక అసలు కారణం అదా?

Mon Aug 10 2020 10:00:25 GMT+0530 (IST)

Is that the real reason behind the Bejawada fire?

బెజవాడతో అనుబంధం ఉన్నోళ్లు ఎవరూ స్వర్ణ ప్యాలెస్ గురించి తెలీనోళ్లు ఉండరు. ఆ త్రీ స్టార్ హోటల్ ను కోవిడ్ సెంటర్ గా మార్చటాన్ని ఎవరూ తప్పు పట్టరు. ఆ హోటల్  ట్రాక్ రికార్డును చూస్తే.. ఇప్పటివరకు ఫైర్ యాక్సిడెంట్ లాంటివేమీ కనిపించవు. ఆ మాటకు వస్తే.. నిలువెత్తు భవనం ఠీగా లభిస్తుంది. అలాంటి భవనంలో షార్ట్ సర్క్యుట్ కారణంగా మంటలు చెలరేగటాన్ని జీర్ణించుకోలేదు.ఇంతకీ.. మంటల వెనుకున్న అసలు నిజం ఏమిటన్న విషయాన్ని ప్రభుత్వం ఇప్పటివరకు చెప్పకున్నా.. అనధికార వర్గాల నుంచి వస్తున్న సమాచారం ఆసక్తికరంగా మారింది. షార్ట్ సర్య్కుట్ కు కారణం..శానిటైజర్ గా చెబుతూ.. కొత్త వాదనను వినిపిస్తున్నారు. శానిటైజర్ తో షార్ట్ సర్క్యుటా? అదెలా అంటారా? అక్కడికే వస్తున్నాం.

ఉదయాన్నే.. గదులను శుభ్రం చేసే క్రమంలో.. శానిటైజర్ ను దట్టంగా.. స్విచ్ బోర్డులను అంటించే కార్యక్రమం జరగుతుందని.. అదే తాజాగా కొంప ముంచిదన్న మాట బలంగా వినిపిస్తోంది. స్విచ్ బోర్డుల్ని.. స్విచ్ లను శానిటైజర్ గా శుభ్రం చేసే ప్రక్రియలో దొర్లిన తప్పు.. ఇంత పెద్ద దుర్ఘటనకు కారణంగా చెబుతున్నారు.  ఈ వాదనను పలువురు సమర్థిస్తున్నారు కూడా. ముందస్తు చర్యల్లో భాగంగా ఇటీవల కాలంలో శానిటైజర్ల వాడకం పెరగటం.. దానికి సంబంధించిన అవగాహన పెద్దగా లేని కారణంగా ప్రమాదాల బారిన పడటాన్ని మర్చిపోకూడదు. ఇదే క్రమంలో బెజవాడ కోవిడ్ సెంటర్ ఉదంతం కూడా ఉందన్న మాట వినిపిస్తోంది. .ఇలాంటి వాటిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వటం ద్వారా ప్రజల్లో మరింత అవగాహన పెంచేందుకు సాయం చేస్తుందన్నది మర్చిపోకూడదు.