టీఆర్ఎస్ మేయర్ అభ్యర్ధిగా సింధు ?

Fri Dec 04 2020 20:30:09 GMT+0530 (IST)

Sindu as TRS mayoral candidate?

అధికారపార్టీ తరపున మేయర్ అభ్యర్ధిగా సింధు ఆదర్శ్ రెడ్డిని మేయర్ గా ప్రకటించటం లాంఛనమేనా ? పార్టీ వర్గాల ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. భారతీనగర్ డివిజన్ నుండి గెలిచిన సింధుకు ప్రగతి భవన్ నుండి పిలుపొచ్చింది. బారతీనగర్ నుండి సింధు వరుసగా రెండోసారి గెలిచారు. గ్రేటర్ ఎన్నకల్లో డివిజన్ల గెలుపు పరంగా సింగిల్ లార్జెస్టు పార్టీగా టీఆర్ఎస్ నిలిచింది. దానికి తోడు మేయర్ పీఠాన్ని గెలుచుకునే అవకాశాలు కూడా పుష్కలంగా ఉంది.అందుకనే అంతిమ ఫలితాలతో సంబంధం లేకుండానే మేయర్ అభ్యర్ధి ఎంపికపై కేసీయార్ దృష్టి పెట్టారు. అధికారపార్టీ తరపున సింధుతో పాటు రాజ్యసభ ఎంపి కే కేశవరావు కూతురు గద్వాల విజయలక్ష్మి మాజీ మంత్రి పీజేఆర్ కూతురు విజయారెడ్డి తదితరులు గెలిచారు. అయితే మేయర్ అభ్యర్ధి జనరల్ మహిళకు రిజర్వు చేయటంతో ప్రధానంగా ఓసీల నుండి గెలిచిన వారిలోనే కేసీయార్ ఎంపిక చేసే అవకాశం ఉందంటున్నారు. ఇందులో భాగంగానే సింధు ఆదర్శ్ రెడ్డిని రమ్మంటు కేసీయార్ కబురు చేశారట.

డిప్యుటి మేయర్ గా బాబా ఫసీయుద్దీన్ ఎంపిక దాదాపు పూర్తియినట్లే అని సమాచారం. ఫసీయుద్దీన్ కూడా బోరబండ డివిజన్ నుండి రెండోసారి గెలిచారు. మేయర్ అంటే ప్రోటోకాల్లో జీహెచ్ఎంసికి సంబంధించి కేసీయార్ కన్నా ముందే ఉంటారు. రాష్ట్రపతి ప్రధానమంత్రి లాంటి ముఖ్యమైన అతిధులను రిసీవ్ చేసుకునే సమయంలో ప్రోటోకాల్ ప్రకారం గవర్నర్ తర్వాత మేయరే ఉంటారు. తర్వాతే ముఖ్యమంత్రి చీఫ్ సెక్రటరీ మంత్రులుంటారు.