Begin typing your search above and press return to search.

రఘురామకృష్ణం రాజుని అప్పుడే టీడీపీ అనుకూల మీడియా తొక్కేసిందా?

By:  Tupaki Desk   |   6 July 2020 9:30 AM GMT
రఘురామకృష్ణం రాజుని అప్పుడే టీడీపీ అనుకూల మీడియా తొక్కేసిందా?
X
యువజన శ్రామిక రైతు పార్టీ ( వైసీపీ) గుర్తు అయిన ‘ఫ్యాన్’ మీద గెలిచాడు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు. కానీ వైసీపీనే ధిక్కరిస్తూ ఈ మధ్య జాతీయ స్థాయిలో వైసీపీకి రెబల్ ఎంపీగా మారారు. ఆయన వైసీపీకి ఎదురు తిరగడంతో ప్రతిపక్ష టీడీపీ అనుకూలంగా మార్చేసుకుంది. అందుకే రఘురామను ఈ మధ్య జాతీయస్థాయిలో టీడీపీ అనుకూల మీడియా హైలెట్ చేసింది.

మొదటి సారి ఎంపీ అయినా కూడా రఘురామ వ్యవహారశైలి అలా లేదంటారు. సీనియర్ ఎంపీ అయిన మాదిరి టీడీపీ అనుకూల మీడియా రఘురామను మోసింది. ఎందుకు అంటే జగన్ సంక్షేమ పథకాలతో దూసుకొని పోతుంటే ఏదో ఒక విధంగా ఆయన ప్రభను తగ్గించేయాలని రఘురామకృష్ణం రాజును లైవ్ డిబేట్లోకి తీసుకొని వచ్చి ఏదో ఒక విధంగా అతడిని రెచ్చగొట్టే ప్రశ్నలు వేసి వైసీపీ పార్టీపై.. ఎమ్మెల్యేలు , మంత్రుల మీద వ్యతిరేకంగా మాట్లాడేటట్టు చేసి సక్సెస్ చేశారు. ఆ ట్రాప్ లో పడిన ఎంపీ రఘురామ మీద వైసీపీ అధిష్టానం సీరియస్ అయ్యి స్పీకర్ కి ఫిర్యాదు చేసేవరకు పరిస్థితిని తీసుకొచ్చారు.

అయితే ఆ పుణ్యకార్య కాస్తా అయ్యాక గత మూడు రోజుల నుంచి అతని రఘురామకృష్ణం రాజును టీడీపీ అనుకూల మీడియా వదిలేసింది. గంగలో కలిపింది. ఇప్పుడు మీడియాలో చూపించకుండా తొక్కేశారు. అతడితో పని ఏమీ ఉందని.. మన టాస్క్ అయిపోయిందని టీడీపీ అనుకూల మీడియాలో అనుకుంటున్నారు. దీనిపై మీడియా సర్కిల్స్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

ఈ మొత్తం వ్యవహారంలో పాపం రఘురామకృష్ణం రాజు బలిపశువు అయ్యారని.. టీడీపీ అనుకూల మీడియా కుట్రలో ఆయన బలైపోయారని.. వాడుకొని వదిలేసి ఆయన పదవిని ఊడగొట్టించడంలో టీడీపీ అనుకూల మీడియా కుట్ర చేసిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ విషయం తెలుసుకోకుండా రెంటికి చెడ్డ రేవడిలా రఘురామకృష్ణం రాజు అయ్యారని చెబుతున్నారు.అయినా చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత అంటే ఇదేనేమో..