Begin typing your search above and press return to search.

తుర్కియే భూకంపంపై ముందస్తు హెచ్చరికలు పట్టించుకోలేదా?

By:  Tupaki Desk   |   7 Feb 2023 10:41 AM GMT
తుర్కియే భూకంపంపై ముందస్తు హెచ్చరికలు పట్టించుకోలేదా?
X
తుర్కియో.. సిరియా ప్రాంతాల్లో వరుసగా మూడు భూకంపాలు సంభవించాయి. సోమవారం తెల్లవారుజామున 7.8 తీవ్రతతో.. మధ్యాహ్నం 1:24 గంటల సమయంలో 7.5 తీవ్రతతో.. సాయంత్రం 6గంటల ప్రాంతంలో 6 తీవ్రతతో భూకంపాలు నమోదయ్యాయి. గంటల వ్యవధిలోనే వరుసగా మూడు భూకంపాలు సంభవించడంతో భారీగా ప్రాణ.. ఆస్తి నష్టం సంభవించింది.

గత 84 ఏళ్లలో తుర్కియోలో తాజాగా నమోదైన భూకంపమే అతిపెద్ద భూకంపమని ఆదేశ అధ్యక్షుడు ఎర్కొవాస్ ప్రకటించారు. వరుస భూకంపాలతో తుర్కియే.. సిరియాల్లో ఇప్పటికే 2,300లకు పైగా పౌరులు మృత్యువాత పడగా భారీ సంఖ్యలో ప్రజలు క్షతగాత్రులుగా మారారు. శిథిలాల కింద ఇరుక్కుపోయిన వారికి బయటికి తీసే సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కన్పిస్తోంది.

అయితే ఇంతటి భారీ భూకంపాన్ని ముందస్తుగా ఎవరూ అంచనా వేయలేదా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఈ భూకంపాన్ని మూడురోజుల క్రితమే ఓ పరిశోధకుడు ముందుగానే హెచ్చరించారు. అయితే వాటిని ఎవరూ పట్టించుకోకపోవడంతో ఈస్థాయిలో ప్రమాద తీవ్రత నెలకొందనే వాదనలు విన్పిస్తున్నాయి.

దక్షిణ మధ్య తుర్కియే.. జొర్డాన్.. సిరియా.. లెబనాన్లో భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని భూకంపాల తీవ్రతను అధ్యయనం చేసే సోలార్ సిస్టమ్ జియోమెట్రో సర్వే సంస్థకు చెందిన పరిశోధకు ప్రాంక్ హుగర్ బీట్స్ ముందుగానే అంచనా వేశారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్లో ఫిబ్రవరి 3నే వెల్లడించాడు. 'త్వరలోనే దక్షిణ తుర్కియే.. జోర్డాన్.. సిరియా.. లెబనాన్ ప్రాంతాల్లో 7.5 తీవ్రతతో భూకంపం సంభవించే అవకాశం ఉందని' పేర్కొన్నాడు.

ఈ మేరకు ఆయన అంచనాలు నిజమయ్యాయి. ఫిబ్రవరి 6న తెల్లవారుజామున మొదలైన భూకంప ప్రకంపనలు తుర్కియోలో విధ్వంసాన్ని సృష్టించిన సంగతి తెల్సిందే. భూకంపం తర్వాత ఫ్రాంక్ హుగర్ బీట్స్ స్పందిస్తూ తనను ఈ ఘటన ఎంతగానో కలిచి వేసిందన్నారు. త్వరలోనే భూకంపం వస్తుందని ముందుగానే హెచ్చరించానని.. అది 115 ఏళ్ల కిత్రం మాదిరిగానే ఉంటుందని పేర్కొన్నట్లు వివరించారు. గ్రహ సంబంధిత సంక్షిష్ట రేఖాగణితం ఆధారంగా వీటిని ముందుగానే అంచనా వేశామని.. స్థానికంగా సంభవించిన భూకంపాల్లో ఇదే అత్యంత తీవ్రమైనని.. మరిన్ని ప్రకంకపలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు.

ఆయన చెప్పినట్లుగానే గంటల వ్యవధిలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. కాగా ఫ్రాంక్ హుగర్ బీట్స్ ముందస్తు హెచ్చరికలపై పలువురు నెటిజన్లు విమర్శలు గుప్పించారు. భూకంపాలను ముందుగా అంచనా వేసేందుకు కచ్చితమైన విధానమేమీ ప్రస్తుతం అందుబాటులో లేదని పేర్కొన్నారు. గతంలోనూ ఆయన అంచనాలు తప్పినట్లు వెల్లడించారు. కానీ ఆయన అంచనా ప్రస్తుతం నిజం కావడంతో ఆయన ట్వీట్ ను లక్షల్లో నెటిజన్లు చూస్తున్నారు.

ఏదిఏమైనా భూకంపాలపై ఎవరైనా ముందుస్తు అంచనాలు వేస్తే వాటిని కొట్టిపారేయకుండా ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకుంటే జరిగే నష్టం కొంతవరకు ఆపొచ్చని.. అదే పట్టించుకోకుండా ఉంటే ఇలాంటి తీవ్ర ఘటనలే జరుగుతాయని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.