Begin typing your search above and press return to search.

వైసీపీకి చివ‌ర‌కు మిగిలేది ఇదేనా..?

By:  Tupaki Desk   |   1 Oct 2022 7:24 AM GMT
వైసీపీకి చివ‌ర‌కు మిగిలేది ఇదేనా..?
X
రాజ‌కీయాల్లో ఇప్పుడు నెటిజ‌న్ల ప్రాధాన్యం కూడా పెరిగిపోయింది. స‌మ‌కాలీన రాజ‌కీయాల‌పై నెటిజ‌న్లు కూడా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ముఖ్యంగా మొబైల్ వాడ‌కం.. డేటా వినియోగం పెరిగిపోయిన ద‌రి మిలా.. నెటిజ‌న్లు.. ఆస‌క్తిగా రియాక్ట్ అవుతున్నారు. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల‌పైనా.. వారు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తున్నారు. వైసీపీకి చివ‌ర‌కు మిగిలేది.. ఇదే.. అంటూ.. కామెంట్లు కుమ్మ‌రిస్తున్నారు.

ఇంత‌కీ విష‌యంలోకి వెళ్తే.. ప్ర‌స్తుతం సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను జోరుగా అమ‌లు చేస్తున్నామ‌ని..త‌మ‌కు తిరుగులేద‌ని అధికార పార్టీ నాయ‌కులు చెబుతున్నారు. ఇదే త‌మ‌కు మేలు చేస్తుంద‌ని అంటున్నారు.

అయితే.. దీనిపై భిన్న‌మైన అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ముఖ్యంగా నెటిజ‌న్లు ఏమంటున్నారం టే.. సంక్షేమం ప‌నిచేయ‌డం క‌ష్ట‌మేన‌ని చెబుతున్నారు. ఎందుకంటే.. జ‌నాల మూడ్‌.. ఎప్పుడు ఎలా మారుతుందో చెప్ప‌డం క‌ష్ట‌మ‌ని అంటున్నారు.

దీనికి వారు.. 2009 ఎన్నిక‌ల‌ను ఉదాహ‌ర‌ణగా పేర్కొంటున్నారు. అప్ప‌టి ఎన్నిక‌ల్లోఅనేక సంక్షేమ కార్య‌క్ర మాలు తీసుకువ‌చ్చారు. అయినా.. కూడా ఆశించిన మేర‌కు ఫ‌లితం రాలేదు. పైగా.. కాంగ్రెస్ సీట్లు త‌గ్గిపో యి.. ప్ర‌తిప‌క్షాల‌కు సీట్లు పెరిగాయి.

అంతేకాదు.. అనుకున్న రేంజ్‌లో కాంగ్రెస్‌కు సీట్లు రాలేదు. ఇప్పుడు కూడా అదే ప‌రిస్థితిని ఏపీలోనూ అంచ‌నా వేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో సంక్షేమం కొంత వ‌ర‌కే ప‌నిచేస్తుం ద‌ని.. ప్ర‌జ‌లు అభివృద్ధి వైపు తిరిగితే ఫ‌లితం వేరేగా ఉంటుంద‌ని చెబుతున్నారు.

ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టి నుంచైనా.. అభివృద్ది వైపు దృష్టి పెట్టాల‌ని అంటున్నారు. ఎన్నిక‌లు అంటే.. కేవ లం సంక్షేమం తీసుకున్న‌వారే కాకుండా.. సంక్షేమం ద‌క్క‌నివారు కూడా.. ఉంటార‌ని..వారిని మెప్పించేలా కూడా.. అడుగులు ముందుకు వేయాల‌ని చెబుతున్నారు. మ‌రి నెటిజ‌న్ల టాక్‌పై వైసీపీ అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.