సర్వే: స్త్రీలకు శృంగారం లాభమా? నష్టమా?

Sat Jul 04 2020 23:51:28 GMT+0530 (IST)

Survey: Is Romance Profitable for Women? Loss?

ఆలుమగలు కానీ.. ప్రేమికుల మధ్య కానీ ప్రేమ ఆప్యాయత పెరగాలంటే శృంగారం వల్లే సాధ్యమని నిపుణులు చెబుతున్నారు. కలయికతో సంతోషాన్నిచ్చే హార్మోన్లు విడుదల అయ్యి తలనొప్పి తగ్గిపోయి ఒత్తిడంతా మాయమై హాయిగా నిద్రపడుతుందని చెబుతున్నారు.మన వేదాల్లోని శాస్త్రాల ప్రకారం.. ఆలుమగలిద్దరూ నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు చలికాలంలో శృంగారంలో ఎక్కువగా పాల్గొనవచ్చని పేర్కొన్నారు. వేసవి కాలంలో రెండు వారాలకోసారి పాల్గొనడం మేలని పెద్దలు చెబుతున్నారు. వర్షాకాలంలో వానాకాలంలో ఒకటి లేదా రెండు సార్లు కలయికలో పాల్గొంటే మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు.

ఆరోగ్యకరమైన శృంగారం వల్ల భార్యభర్తల్లో ఇమ్యూనిటీ పెరిగి వైరస్ బ్యాక్టీరియా విషాలను ఎదుర్కొనే శక్తి పెరుగుతుందని తేలింది.

శృంగారం వల్ల గుండె కండరాలు బలోపేతమై రక్తపీడనం తగ్గి గుండెపోటు ప్రమాదాలు తగ్గుతాయట.. మహిళల జననాంగాలు బలంగా మారుతాయట.. గర్భాశయ క్యాన్సర్ తో పోరాడే శక్తి మహిళల్లో పెరుగుతుంది.

శృంగారం వల్ల కొన్ని నొప్పులు తగ్గుతాయి. తలనొప్పి పీరియడ్స్ పెయిన్ వెన్నునొప్పులన్నీ మాయమవుతాయి. అంతిమంగా శృంగారంతో ఆనందం పొందుతారని.. నిశ్చితంగా శృంగార జీవితాన్ని అనుభవించాలని నిపుణులు సూచిస్తున్నారు.