పతంజలి వారి అవాలనూనె వాడుతున్నారా? ఇది చదవాల్సిందే

Thu Jun 10 2021 13:00:01 GMT+0530 (IST)

Is Patanjali using their avalanche oil? This is a must read

యోగా గురువుగా సుపరిచితులు.. తన  పతంజలి బ్రాండ్ తో బడా కంపెనీలకు సైతం షాకిచ్చిన రాందేవ్ బాబాకు ఇటీవల కాలంలో తరచూ ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ వేళ.. నోటికి పని చెప్పిన ఈ యోగా గురువు వ్యవహారం రచ్చ రచ్చగా మారింది. తమ పతంజలి వస్తువుల పని తీరు గురించి గొప్పలు చెప్పే రాందేవ్ కు తాజా పరిణామం షాకిస్తుందని చెబుతున్నారు.గడిచిన పదేళ్లలో పతంజలి ఉత్పత్తుల్ని కొనేవారు ఎక్కువయ్యారు. హిందుత్వం.. దానికి తోడు భారత్ బ్రాండ్.. ప్రత్యర్థులతో పోలిస్తే ధరలు తక్కువగా ఉండటం..రాందేవ్ బాబా ఛరిష్మా ఇవన్నీ పతంజలి ఉత్పత్తుల్ని దేశ వ్యాప్తంగా పల్లెల్లో కూడా వినియోగించటం ఎక్కువైంది. అలాంటి వేళ.. తమ ఉత్పత్తుల నాణ్యత మీద బాబా మరింత ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే.. తాజాగా పతంజలి బ్రాండ్ ఉత్పత్తి చేసే ఆవాల నూనెలో నాణ్యత ప్రమాణాలకు తగ్గట్లు లేదని పరీక్షల్లో తేలింది.

రాజస్థాన్ లోని సింఘానియా ఆయిల్ మిల్లు పతంజలికి ఆవాల నూనెను సరఫరా చేస్తుంటుంది. దీనికి సంబంధించిన ఐదు నమానాలు సేకరించిన అధికారులు వాటిని పరీక్షించారు. అయితే.. ఈ ఐదు నమూనాలు నాణ్యత పరీక్షల్లో విఫలమయ్యాయి. ఆవనూనెలో అవసరమైన ప్రమాణం ప్రకారం నాణ్యత లేదని తేలింది. పతంజలి ఆవాల నూనెతో పాటు..శ్రీశ్రీ తత్వ బ్రాండ్ ఆవాల నూనె కూడా నాణ్యత లేదని తేల్చింది. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోట్ ఆదేశాల మేరకు ఈ దాడులు జరిగినట్లుగా తెలుస్తోంది.