పీకే పరిస్దితి ఇలాగైపోయిందా ?

Tue Oct 04 2022 11:00:01 GMT+0530 (India Standard Time)

Is PK situation like this?

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) పరిస్థితి చివరకు ఇలాగైపోయింది. ఎంతకాలం రాజకీయ వ్యూహకర్తగా ఉంటామని అనుకున్నారో ఏమో ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగాలని డిసైడ్ అయ్యారు. అనుకున్న వెంటనే జనాల్లోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. అందుకు తగ్గట్లే గాంధీ జయంతి రోజు అంటే అక్టోబర్ 2వ తేదీన బీహార్ రాష్ట్రంలోని పశ్చిమ చంపారన్ జిల్లా బేతియాలో జనసురక్షా పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.3500 కిలోమీటర్ల పాదయాత్ర చేయటానికి అన్నీ ఏర్పాట్లు చేసుకుని బేతియాలో భారీ బహిరంగ సభ ప్లాన్ చేశారు. అయితే పాదయాత్ర మొదలయ్యే సమయానికి సభా ప్రాంగంణంలో అసలు జనాలే లేరు. నిర్వాహకులు అంత భారీ ఎత్తున ఏర్పాట్లుచేసినా పట్టుమని పదిమంది కూడా జనాలు లేకపోవటంతో అందరికీ షాక్ కొట్టినట్లయ్యింది. దాంతో చేసేదిలేక బహిరంగసభను ముగించేసి పాదయాత్ర మొదలుపెట్టేశారు.

పోనీ పాదయాత్రలో అయినా జనాలున్నారా అంటే ఇక్కడా లేరు. పీకే యాత్ర జనాలు లేక కళావిహీనంగా మొదలైంది. మామూలుగా పాదయాత్రన్నా బహిరంగసభలన్నా నిర్వాహకులు విజయవంతమయ్యేట్లుగా అన్నీ చర్యలు తీసుకుంటారు.

కాకపోతే బహిరంగసభలు పాదయాత్రలు జరిగేది రాజకీయ నేతల ఆధ్వర్యంలోనే కాబట్టి జనాలు కూడా వస్తారు. కానీ ఇక్కడ మొదలైంది రాజకీయ వ్యూహకర్త పీకే ఆధ్వర్యంలో. పీకే అంటే జనాల్లో చాలామందికి ఎవరో కూడా తెలీదు. ఇక్కడ సమస్యంతా ఏమిటంటే పీకే తనను తాను చాలా ఎక్కువగా అంచనా వేసుకోవటంతోనే వచ్చింది.

కొన్ని రాజకీయపార్టీల విజయాల్లో పీకే కూడా భాగస్వామిగా ఉండటంవల్ల రాజకీయ నేతలకన్నా తాను ఎందులో తక్కువ అన్న ఆలోచన వచ్చినట్లుంది. బహుశా తాను లేకపోతే తాను పనిచేసిన పార్టీలు అధికారంలోకి వచ్చుండేవి కావనే ఆలోచనలో కూడా ఉన్నారేమో.

అందుకనే వాళ్ళకన్నా తానే చాలా ఎక్కువనే అభిప్రాయం స్ధిరపడిపోయింది. ఈ నేపధ్యంలోనే తన కెపాసిటి ఏమిటో చూపించాలని అనుకుని డైరెక్టుగా రాజకీయాల్లోకి వచ్చేయాలని బాగా ఉత్సాహపడుతున్నారు. ఇందులో భాగమే ఇపుడు తగిలిన షాక్.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.