Begin typing your search above and press return to search.

ప్రతి కరోనా కేసుకు మోడీ కారణమా?

By:  Tupaki Desk   |   22 April 2021 6:30 AM GMT
ప్రతి కరోనా కేసుకు మోడీ కారణమా?
X
ఈ దేశంలో ప్రశ్నిస్తే వాళ్లు దేశ ద్రోహులు అవుతున్నారన్న ఆవేదన మేధావి వర్గంలో ఉంది. బీజేపీ ప్రభుత్వం కొలువుదీరాక దేశంలో హిందుత్వ, జాతీయవాదం పెరిగిపోయింది. అన్యాయాలాపై ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వంపై ప్రశ్నిస్తే వారిని దేశ దోహ్రులుగా ముద్ర వేస్తున్న పరిస్థితి ఉందంటున్నారు.

సామాన్యులు, మేధావులకే కాదు.. ఈ తిప్పలు మాజీ ప్రధానులకు కూడా ఎదురవుతోంది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ రావడానికి కేంద్రంలోని మోడీ సర్కార్ ఫెయిల్యూర్ ఉందన్నది కాదనలేని వాస్తవం. ఎందుకంటే మొదటి వేవ్ వచ్చినప్పుడే ఆస్పత్రులకు మౌళిక సదుపాయాలు పెంచి.. ఆక్సిజన్ కొరతను నివారిస్తే ఇప్పుడీ పరిస్థితి ఉండేది కాదన్నది వాస్తవం.

ఇక దేశంలో వ్యాక్సిన్ రిలీజ్ అయ్యాక వాటి ఉత్పత్తికి తయారీ సంస్థలు, నిధులు, మౌలిక సదుపాయాలు కల్పిస్తే ఇప్పటికే దేశమంతా వ్యాక్సిన్ సరఫరా జరిగి కరోనాను అరికట్టేవాళ్లం. కానీ మోడీ గొప్పలకు పోయి పక్కదేశాలకు పంపి దేశ ప్రజలను విస్మరించిన పాపానికి ఇప్పుడు సెకండ్ వేవ్ లో మరణాలు సంభవిస్తున్నాయని విమర్శలు వస్తున్నాయి.

కరోనాను ఎదుర్కోవడంలో మోడీ ఫెయిల్ అయ్యాడని.. ఎలా ఎదుర్కోవాలో సూచిస్తూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సలహాలు ఇస్తూ మోడీకి లేఖ రాశారు. ఆ లేఖపై కూడా బీజేపీ విరుచుకుపడింది. మన్మోహన్ ను అగౌరపరిచేలా కేంద్రమంత్రి హర్షవర్ధన్ వ్యాఖ్యానించడం దుమారం రేపింది. ఇలా ఎవరు ప్రశ్నిస్తే వారి మీద పడిపోవడం బీజేపీకి అలవాటుగా మారిందన్న విమర్శ ఉంది.

ప్రస్తుతం దేశంలో నమోదవుతున్న ప్రతీ కరోనా కేసుకు ప్రధాని మోడీనే కారణం అని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఆరోపిస్తున్నారు. సెకండ్ వేవ్ ను ఎదుర్కోనేందుకు మోడీ ఏమాత్రం సిద్ధం కాలేదని విమర్శించారు. ఈ క్రమంలోనే తన అసమర్థతను కప్పి పుచ్చుకునేందుకు మోడీ పదే పదే నెహ్రూ పై నిందలు వేస్తున్నారని ఆమె ఆరోపించారు.

ఇలా దేశంలో ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ కు మోడీనే కారణం అని అందరూ వేళ్లు చూపిస్తున్నారు.కానీ బీజేపీ మాత్రం దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించకుండా ఎదురుదాడి చేస్తోంది.