లక్ష్మీపార్వతికి పిచ్చిపట్టిందా?

Tue Jan 18 2022 12:21:34 GMT+0530 (IST)

Is Lakshmi Parvati mad?

ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. ఆయన 26వ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా తన నాన్నను తలుచుకొని అగ్రహీరో ఎమ్మెల్యే బాలకృష్ణ ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. అనంతరం బాలయ్య మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ జీవితం అందరికీ ఆదర్శం అన్నారు. తెలుగు జాతి ఉన్నంత వరకూ ఎన్టీఆర్ ఉంటారని అన్నారు.తెలుగుజాతిలో ఎన్టీఆర్ పుట్టడం మన అదృష్టం అని బాలయ్య అన్నారు. కాంగ్రెస్ ను కూకటి వేళ్లతో పెకిలించిన వ్యక్తి ఎన్టీఆర్ అని.. ఎక్కడి స్థానికులకు అక్కడే ఉద్యోగాలు ఇవ్వాలని అప్పట్లో ఎన్టీఆర్ సీఎంగా ఉండగా 610 జీవోను తీసుకొచ్చారని.. ఇప్పుడు తెలంగాణలో ఉద్యోగులు స్థానికతపై ఆందోళన చేస్తున్నారని బాలక్రిష్ణ ఆరోపించారు.

వీరందరూ వెళ్లాక ఎన్టీఆర్ భార్య అయిన లక్ష్మీపార్వతి సమాధి వద్దకు వచ్చారు. తన భర్తకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మీపార్వతి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.  ‘ఎన్టీఆర్ చనిపోయినప్పుడు ఆయన ఆత్మతో మాట్లాడానని’ లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు. 26 ఏళ్ల తర్వాత ఒక రహస్యం చెబుతున్నానని.. ఎన్టీఆర్ చనిపోయినప్పుడు జీవిత రాజశేఖర్ తనను మద్రాస్ తీసుకెళ్లి ఒక అమ్మాయితో మాట్లాడించారన్నారు.  ఎన్టీఆర్ ఆత్మ 16 ఏళ్ల అమ్మాయిలో ప్రవేశించి తనతో అనేక విషయాలు పంచుకుందని లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో తాను మళ్లీ జన్మిస్తానని.. అందరి ముఖ్యమంత్రుల మనస్సులో తాను ఉంటానని.. ప్రజలకు మంచి చేయాలని తాను ప్రబోధం చేస్తుంటానని ఆయన ఆత్మ తనతో చెప్పిందని లక్ష్మీపార్వతి మీడియా ఎదుట వ్యాఖ్యానించారు.

ఆ అమ్మాయితో మాట్లాడినప్పటి నుంచి తనకు ఓ నమ్మకం అని.. ఎన్టీఆర్ ఆత్మ ఇక్కడే ఉందని.. ఆ ఆత్మ తిరుగుతూ అందరి బాగోగులు చూసుకుంటోందని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు.

ఇక ఎన్టీఆర్ ఆత్మతో మాట్లాడానన్న లక్ష్మీపార్వతి  వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. కొందరు నెటిజన్లు దీనిపై ఘాటుగా స్పందిస్తున్నారు. లక్ష్మీపార్వతికి ఏమైనా పిచ్చిపట్టిందా? అని కొందరు కామెంట్ చేస్తున్నారు.