Begin typing your search above and press return to search.

టీడీపీకి కుప్పం రెడ్ జోన్ లో ఉందా...?

By:  Tupaki Desk   |   30 Jan 2023 12:09 PM GMT
టీడీపీకి కుప్పం రెడ్ జోన్ లో ఉందా...?
X
తెలుగుదేశం భావి నాయకుడు చినబాబు నారా లోకేష్ పాదయాత్ర స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఎంచి మరీ తన తండ్రి ఏడు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన కుప్పం నియోజకవర్గం నుంచి పాదయాత్రను మొదలెట్టారు. మరి కుప్పంలో తెలుగుదేశం పరిస్థితి ఏంటి అన్న చర్చ అయితే అంతటా వస్తోంది. కుప్పం చూస్తే టీడీపీకి ఏమైనా రెడ్ జోన్ లో ఉందా అన్న డౌట్లు వస్తున్నాయిట.

ఈ సంగతి ఎలా తెలిసింది అంటే ఏకంగా లోకేష్ తోనే క్యాడర్ చెబుతోంది. పాదయాత్రలో భాగంగా లోకేష్ పార్టీ క్యాడర్ తో ముఖాముఖీ భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక లీడర్ అయితే ఉన్నది ఉన్నట్లుగా కుండబద్ధలు కొట్టేసి చినబాబుకు తెలుగుదేశం పార్టీకి అసలు విషయం ఏంటో బోధపడేలా చేశారు అని అంటున్నారు. ఇంతకీ ఆ లీడర్ చెప్పిన మాట ఏంటి అంటే కుప్పంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏ మాత్రం బాగులేదని. పైగా తెలుగుదేశానికి లోకేష్ కి చంద్రబాబుకు ఎప్పటికపుడు వచ్చే నివేదికలు అన్నీ తప్పుడుగా ఉంటున్నాయని.

నిజంగా ఇది తెలుగుదేశం గుండె పగిలే వార్తే. తెలుగుదేశానికి అధినాయకుడిగా ఉన్న చంద్రబాబు సొంత సీటు కుప్పంలోనే రెడ్ సిగ్నల్స్ పడుతున్నాయని అంటున్నారు అంటే ఆలోచించుకోవాల్సిందే కదా. ఆ లీడర్ చెబుతున్నది ఏమిటి అంటే కుప్పంలో అసలు జరుగుతున్నది వేరు. నిజాలు అన్నీ దాచేస్తున్నారు అని. కుప్పంలో ఏ మాత్రం పరిస్థితి బాగులేదని ఆ లీడర్ చెప్పేశారుట.

అంటే ఇక్కడ వైసీపీ గెలిచేస్తామని చెబుతున్న దాంట్లో ఎంతో కొంత నిజం ఉందా అంటే ఉంది అనే అంటున్నారు. కుప్పంలో తెలుగుదేశానికి ఎదురు గాలులు వీస్తున్నాయని ఏకంగా సొంత పార్టీ నాయకుడే లోకేష్ ఎదుటే ముఖా ముఖీగా చెప్పారు అంటేనే ఆలోచించాల్సిన విషయమే. మ్యాటర్ వెరీ సీరియస్ అని అర్థం చేసుకోవాల్సిందే అంటున్నారు.

ఇక ఈ విషయం మీద కుప్పంలో తెలుగుదేశం పార్టీ ఎలా ఉంది అన్నది ఆ పార్టీ చెక్ చేసుకుని లోపాలు ఏమైనా ఉంటే సరిచేసుకోవాల్సిందే అని అంటున్నారు. దీంతో ఒకసారి చెక్ చేసుకోవాలని టీడీపీ ఆఫీస్ నుంచి లోకల్ కు క్లాస్ పీకారు అని అంటున్నారు. ఏది ఏమైనా లోకేష్ కుప్పం యాత్ర బాగా జరిగింది అంటున్నారు. జనాలు వచ్చారు. కానీ ఆ జనాలు అంతా అక్కడి వారు కాదు, ఆ హంగామా అంతా తెలుగుదేశం పార్టీ తలచుకుంటే క్షణాలలో జరిగిపోతుంది. మరి కుప్పం ఓకే ఆల్ ఈజ్ వెల్ అనుకుని కళ్ళు మూసుకుంటే మాత్రం డేంజర్ బెల్స్ మోగడం ఖాయం అన్నది లోకల్ లీడర్ ఒకరు చెప్పగా లోకేష్ కే నేరుగా తెలిసింది.

ఇప్పటికైనా సమయం మించిపోయింది లేదు. నిజానికి పాదయాత్రలో లోకేష్ జనాల సంగతి ఎలా ఉన్నా పార్టీ పరిస్థితి కూడా చూసుకోవాలి కదా. ఆ విధంగా ఆయన తన తండ్రి సీటు నుంచే పోస్ట్ మార్టం మొదలెట్టడానికి ఈ ఫీడ్ బ్యాక్ బాగా ఉపయోగపడింది అంటున్నారు. పాదయాత్రలో ఇది వేడి హెచ్చరికగానే చూడాలి. ఏకంగా చంద్రబాబు సీటుకే ఇలా కన్నం పడిపోతే రానున్న సీట్లలో సీన్ ఎలా ఉంటుందో తెలుగుదేశం పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో ముందు ముందు తెలుస్తుంది అని అంటున్నారు. దీని అంతటికీ కారణం గ్రౌండ్ లెవెల్ లో టీడీపీ క్యాడర్ మునుపటిలా యాక్టివ్ గా లేదు అన్నదే అసలైన నిజం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.