Begin typing your search above and press return to search.

బీజేపీలోకి ఏపీ మాజీ ముఖ్యమంత్రి!

By:  Tupaki Desk   |   27 Jun 2019 10:30 AM GMT
బీజేపీలోకి ఏపీ మాజీ ముఖ్యమంత్రి!
X
ఉమ్మడి ఏపీ ఆఖరి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు మళ్లీ పార్టీ మారబోతూ ఉన్నారట! సొంత పార్టీని పెట్టుకుని మరీ హడావుడి చేసిన కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు రాజకీయ ఉనికిని చాటుకోవడానికి మరో పార్టీలోకి చేరబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ సారి బీజేపీలోకి చేరబోతున్నారట కిరణ్!

రాష్ట్ర విభజన ఆఖరి వరకూ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కిరణ్. ఆ పార్టీ ద్వారా దక్కిన ముఖ్యమంత్రి పదవిని అనుభవించి..తీరా విభజనకు పార్లమెంట్ ఆమోద ముద్ర వేసిన తర్వాత ‘జై సమైక్యాంధ్ర’ అన్నారు. ఆ పేరుతో పార్టీ కూడా పెట్టారు. అయితే దాన్ని ప్రజలు మెచ్చలేదు.

ఆ పార్టీ ఎక్కడా ఉనికి చాటలేకపోయింది. కొన్ని నియోజకవర్గాల్లో అయితే వంద, రెండు వందల ఓట్లు కూడా రాలేదు. అలా కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ ప్రజల తిరస్కరణకు గురి అయ్యింది.

ఆ తర్వాత కొంత కాలం పాటు కిరణ్ రాజకీయం అచేతన స్థితికి వెళ్లారు. చివరకు కాంగ్రెస్ పార్టీలోకే మళ్లీ చేరారు. కాంగ్రెస్ పార్టీ తనకు తల్లిలాంటిదన్నట్టుగా ఇటీవలే ఆ పార్టీలో చేరినప్పుడు కిరణ్ ప్రకటించుకున్నారు.

అయితే ఇప్పుడు మళ్లీ ఆ పార్టీని వీడబోతున్నాడట కిరణ్ కుమార్ రెడ్డి. మాజీలను చేర్చుకుని ఏపీలో బలోపేతం కావాలని భారతీయ జనతా పార్టీ భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కిరణ్ కుమార్ర ఎడ్డికి కూడా ఆ పార్టీ గాలం వేస్తున్నట్టుగా సమాచారం!