Begin typing your search above and press return to search.

దూసుకొస్తున్న బాణం.. కేసీఆర్ తెగ ఇబ్బంది పడుతున్నారా?

By:  Tupaki Desk   |   5 Dec 2022 4:32 AM GMT
దూసుకొస్తున్న బాణం.. కేసీఆర్ తెగ ఇబ్బంది పడుతున్నారా?
X
ఒకరు నీ గురించి గొప్పగా చెప్పనప్పుడు.. నీ గొప్పతనాన్ని కీర్తించనప్పుడు.. నీ గురించి ఎవరో కాకుండా నువ్వే మాట్లాడితే సరిపోతుంది కదా? ఈ సూత్రాన్ని ఇతర రంగాలతో పోలిస్తే రాజకీయ రంగంలో మా జోరుగా వాడేస్తుంటారు. తమను తాము పొగుడుకోవటానికి అధినేతలు ఏ మాత్రం వెనుకాడరు. తమ సత్తా ఏమిటో మాటలతో చెబుతూ.. తేడా వస్తే చేతల్లో చూపిస్తామని చెబుతామంటారు. ఇప్పుడు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చెబుతున్నారు.

తనను చూసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి బయపెడుతున్నారంటూ తాజాగా షర్మిల ఇచ్చిన స్టేట్ మెంట్ ఆమె తన ఇమేజ్ గ్రాఫ్ ను కాస్తంత పెంచుకొని చెప్పారనే చెప్పాలి. తెలంగాణ లో పార్టీ పెట్టిన సమయంలో ఆమె మీద ఎలాంటి ఆశలు లేవు. సరైన నేత ఒక్కరు ఆమె వెంట లేరు.

సఅయినప్పటికీ ఆశ కోల్పోకుండా.. ఏటికి ఎదురీదినట్లుగా ఆమె తీరు ఉంది. తాను ఏం చెప్పినా మాటలు నమ్మే పరిస్థితుల్లో లేరన్న స్థాయి నుంచి అదే పనిగా పాదయాత్రను నిర్వహించటం ద్వారా.. తెలంగాణప్రజలు తన గురించి మాట్లాడే పరిస్థితిని కల్పించారు. ఆమె లక్ష్యం చూస్తే.. ఇప్పటికిప్పుడు అధికారంలోకి వచ్చేసి.. తెలంగాణను ఏలేయాలన్న ఆలోచన ఏమీ లేదని చెబుతారు.

స్లో అండ్ స్టడీ అన్న చందంగా తెలంగాణలో తనను ఆమోదించే వరకు వెయిట్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. అందులో భాగంగానే సుదీర్ఘ ప్లాన్ సిద్ధం చేసినట్లు చెబుతారు. మిగిలిన వారికి భిన్నంగా తన టార్గెట్ గులాబీ బాస్.. ఆయన కుటుంబ సభ్యులని తేల్చిన షర్మిల.. తన 3500కిమీ పాదయాత్ర సందర్భంగా తాను యాత్ర చేసిన నియోజకవర్గాలు.. వాటి ఎమ్మెల్యేల పని తీరు మీద తనకు అందిన గ్రౌండ్ రిపోర్టును ప్రజల ముందు పెట్టటంద్వారా అటు గులాబీ నేతలకు మాత్రమే కాదు ముఖ్యమంత్రి కేసీఆర్ ను సైతం ఆరోపణలతో ఉతికి ఆరేస్తున్న పరిస్థితి.

తాను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పి.. తన సవాల్ కు ప్రతి సవాల్ విసిరి.. గ్రౌండ్ లోకి వచ్చి తాను చెప్పినవన్నీ అబద్ధాలనే విషయాన్ని తేలిస్తే.. తాను నేలకు ముక్కు రాసి వెళ్లిపోతానని చెప్పే షర్మిల మాటలు ఇప్పుడిప్పుడే మెదడులోకి ఎక్కుతున్న పరిస్థితి. ఈ విషయాన్ని గులాబీ బాస్ గుర్తించే.. దానికి అడ్డుకట్టే వేసేందుకు వీలుగా ఆమె యాత్రకు నో అనుమతి అన్న విషయాన్ని తేల్చేసినట్లుగా చెబుతున్నారు.

అంతే కాదు.. తాను.. తన కుటుంబ సభ్యులు ఎవరూ షర్మిల గురించి మాట్లాడకుండా మౌనంగా ఉండటం ద్వారా బాణం వేగాన్ని తగ్గించటంతో పాటు.. దిశను కూడా మార్చాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఏమైనా గులాబీతోటను లక్ష్యంగా చేసుకొని దూసుకొస్తున్న బాణం తీవ్రతను గులాబీ దళపతి గుర్తించినట్లే అన్న మాట వినిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.