జనసేనకు దొరికింది ఇద్దరేనా ఎమ్మెల్యే క్యాండిడేట్స్...?

Mon Jan 23 2023 13:13:13 GMT+0530 (India Standard Time)

Is Janasena Has Only Two MLA Candidates

జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన సామాన్యుడైన వారు కాదు ఇటు సినిమాల పరంగా ఆయనది భయంకరమైన ఇమేజ్. అలాగే రాజకీయాల్లో కూడా ఆయనకు మాస్ ఫాలోయింగ్ వీర లెవెల్ లో ఉంది. ఆయన ఇలా ఒక్క చిటిక వేయాలే కానీ క్షణాల్లో లక్షల జనాలు వచ్చి ఆయన మీటింగ్ కోసం వేచి చూస్తారు. అలాంటి చరిష్మాటిక్ పొలిటికల్ ఫిగర్ ఏపీలో పవన్ ఒక్కరే అని చెప్పాల్సి ఉంటుంది.ఇక పవన్ ఒక్కడితే సినిమా గ్లామర్ కాదు ఆయన మెగా ఫ్యామిలీ అతి పెద్ద కోటగా ఉంది. అందులో ఏకంగా ఏడుగులు హీరోలు ఉన్నారు. ఇక పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ చూద్దామా అంటే ఇప్పటికి మూడు ఎన్నికలకు ముందు పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో పవన్ కళ్యాణ్ అత్యంత కీలకమైన పాత్ర పోషించారు. ఆయన యువరాజ్యం నేతగా నాడే సందడి చేశారు. ఇక ఇద్దరు ఉద్దండ రాజకీయ నేతల మధ్య ప్రజారాజ్యం నిలిచి ఏకంగా డెబ్బై లక్షల ఓట్లను తెచ్చుకుంది అంటే అది మామూలు విషయం కానే కాదు.

అలా ప్రజారాజ్యం దన్ను కూడా ఇపుడు జనసేనకు ఉన్నట్లే అనుకోవాలి. అంటే ఒక విధంగా డెబ్బై లక్షల ఓట్లలో చాలా మటుకు ఇపుడు జనసేనకు టర్న్ అయ్యే చాన్స్ కూడా ఉంది. అలాగే ఆనాడు ఏకంగా పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు కూడా ప్రజారాజ్యం నుంచి గెలిచారు. వారంతా ఏపీకి చెందిన వారే కావడం విశేషం.

ఇంతలా జనసేన పొలిటికల్ బ్యాకప్ ఉంటే 2019 ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేస్తే కేవలం 6.5 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి అంటే ఆలోచించాల్సిన విషయమే అంటున్నారు. ఇక జనసేన తరఫున ఆ ఎన్నికల్లో ఒకే ఒక ఎమ్మెల్యే గెలిచినా ఆయన వైసీపీలోకి జంప్ అయ్యారు. అదే ఎన్నికల్లో మరో చేదు అనుభవం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేసినా ఓటమి పాలు అయ్యారు. ఇది నిజంగా రాజకీయ చరిత్రలో అరుదైన ఘటంగానే చూడాలి.

ఇలా 2019 లో పోటీ చేసి ఓడాక పవన్ కళ్యాణ్ కి రాజకీయ అంటే అర్ధం అయింది అని అంటున్నారు. ఇక క్యాడర్ లేని పార్టీగా జనసేన ఉందని అందుకే క్యాండిడేట్స్ కూడా దొరకడంలేదు అని కూడా బాగా అర్ధం అయింది అంటున్నారు. అంతే కాదు ఎన్నికల రాజకీయం అంటే చాలా ఉంటుంది. ముఖ్యంగా పోల్ మేనేజ్మెంట్ చేయాలి. అది ఒక బ్రహ్మాండమైన ఆర్ట్. అది చేయని పార్టీకి ఓట్లు ఈవీఎంలలో పడనే పడవు అని కూడా పవన్ కి బోధపడింది అని అంటున్నారు.

ఇలా కనుక చూసుకుంటే చెప్పుకుంటే పవన్ కళ్యాణ్ కి ఆయన జనసేన పార్టీకి నాదెండ్ల మనోహర్ తప్ప మరో క్యాండిడేట్ ఈ  రోజుకీ ఎమ్మెల్యే సీటు పోటీకి లేరని కూడా అవగతం అయింది అని అంటున్నారు. ఈ రోజుకు ఒక మారు జనసేన ఆలోచించుకుంటే ఆ పార్టీకి ఇద్దరే నాయకులు. ఇద్దరే ఎమ్మెల్యే క్యాండిడేట్లు. మూడవ వారు లేరు. ఒకవేళ ఉన్నారని చెప్పుకున్నా వారంతా రెండు మూడు వేల ఓట్లు తెచ్చుకునే స్థాయి కలిగిన వారే కానీ నియోజకవర్గం మొత్తం ప్రభావితం చేసి సై అంటే సై అని ప్రత్యర్ధి పార్టీలతో నెగ్గుకువచ్చే వారు కాదని కూడా బాగా అర్ధం అయింది అంటున్నారు.

ఇంత అర్ధమయ్యాక పవన్ ఏమి అంటున్నారు అంటే ఒంటరిగా వెళ్తే వీర మరణం అని. అది ఆయనకు చాలా బాగా అర్థం అయింది అని రణస్థలం సభలో చెప్పుకున్నారు. నిజంగా 2024లో ఒంటరిగా వెళ్తే ఇబ్బంది అవుతుంది అన్న సంగతి పవన్ కి అర్ధం అయిన తరువాతనే తెలుగుదేశంతో పొత్తులకు వెళ్తున్నారు అని అంటున్నారు. అయితే జనసేన గ్రాఫ్ పెరిగింది అని అంటున్న వార్తలు ఉన్నాయి. అయితే ఆ పార్టీ చెప్పుకుంటున్నట్లుగా  24 శాతానికి ఈ రోజు 2024 నాటికి అది కాస్తా 40 శాతం అని ఏమీ లేదు అని కూడా అంటున్నారు.

జనసేనకు గతంతో పోలిస్తే మరో నాలుగైదు శాతం ఓట్లు పెరిగి ఉంటాయని అది ఒక పది శాతానికి చేరుకోవచ్చు అని అంటున్నారు. మరి ఈ పది శాతం ఓట్లు కూడా కేవలం పవన్ కోసం ఆయన మీద వీరావేశం తో ఉన్న వారి నుంచే అని అంటున్నారు. ఇక జనసేన వీటిని జాగ్రత్తగా వేసుకుంటేనే అవి పదిలంగా ఈవీఎంలలో పడతాయి. ఇక ఈ ఓట్లు ఎంతవరకూ ఇతర పార్టీలకు పొత్తులలో బదిలీ అవుతాయి అన్నది కూడా చెప్పలేని పరిస్థితి.

 మొత్తానికి మూడు ఎన్నికల నుంచి రాజకీయాల్లో ఉన్న పవన్ కి తత్వం బోధపడింది అని అంటున్నారు. అయితే అర్ధం కావాల్సింది మాత్రం ఆయన్ని సీఎం కావాలి అని అంటున్న వారికే అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఏపీ నాకు ముఖ్యమనుకునే పొత్తులకు దిగుతున్నారు అనుకుంటే ఏపీలో రాజకీయం ఒకలా సాగుతుంది మారుతుంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.     నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.