Begin typing your search above and press return to search.

చంద్రబాబుకి భయం వెంటాడుతోందా?

By:  Tupaki Desk   |   10 Aug 2020 10:30 AM GMT
చంద్రబాబుకి భయం వెంటాడుతోందా?
X
చంద్రబాబుకి కరోనా ఫోబియా వెంటాడుతోందా అంటే అవును అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు.. ఎందుకంటే చంద్రబాబు.. తాడేపల్లిలోని తన అద్దె ఇంట్లో కూర్చొని సోషల్ డిస్టేన్స్ పాటించుకుంటూ ఏపీలో రాజకీయం చేయవచ్చు. కానీ అక్కడికి రాకుండా హైదరాబాద్ లోని ఇంట్లో ఉంటూ జూమ్ యాూప్ లో.. ట్విట్టర్ లో ప్రసంగిస్తూ రాజకీయం చేస్తున్నాడనే విమర్శలను చంద్రబాబు ఎదుర్కొంటున్నాడు.

సరే చంద్రబాబు అంటే 70 ఏళ్లు దాటాయి.. వృద్ధుడైపోయాడు.. కరోనా బారిన పడితే ప్రమాదం అని భయపడి ఇలా ఇంట్లోనే ఉండి జాగ్రత్తలు తీసుకుంటున్నాడని అనుకోవచ్చు. కానీ యువకుడైన ఆయన కుమారుడు యువ నేత నారా లోకేష్ కు ఏమైందని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. లోకేష్ ను అయినా తాడేపల్లికి పంపవచ్చు కదా అని చంద్రబాబును కోరుతున్నారు. కానీ అది కూడా బాబు చేయడం లేదని పార్టీ వర్గాల్లో తీవ్ర నిరాశ వ్యక్తం అవుతోందట..

ఇక టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు సమస్యలు చెప్పుకుందామని హైదరాబాద్ వస్తామన్నా చంద్రబాబు అపాయింట్ మెంట్ ఇవ్వకుండా రావద్దు అని అంటున్నాడని నేతలు వాపోతున్నారు. అర్జంట్ ఉంటే ఫోన్ లో మాట్లాడు అని సెలవిస్తున్నారట.. దీంతో మా సమస్యలు ఎవరు వినాలి? ఎవరు తీర్చాలని టీడీపీ నాయకుల్లో సందేహాలు తలెత్తుతున్నాయని ఆ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం సాగుతోంది.