Begin typing your search above and press return to search.

న్యూయార్క్ టైమ్ స్వైర్ దగ్గర అయోధ్య లైవ్ నిజమేనా?

By:  Tupaki Desk   |   6 Aug 2020 8:10 AM GMT
న్యూయార్క్ టైమ్ స్వైర్ దగ్గర అయోధ్య లైవ్ నిజమేనా?
X
గోరంతకు కొండంతలు చేసి చెప్పుకోవటం కొందరికి అలవాటు. ఇటీవల కాలంలో మోడీ వీర భక్తులు తమకు తోచిన సమాచారాన్ని తమకు తగ్గట్లు.. తమ అధినాయకుడి ఇమేజ్ ను భారీగా పెంచేలా కథలు.. కథలుగా ప్రచారం చేస్తారు. ఎక్కడి దాకానో ఎందుకు.. లాక్ డౌన్ కు ముందు జనతా కర్ఫ్యూ నిర్ణయాన్ని ప్రకటించిన సమయంలో.. వాట్సాప్ లలో.. సోషల్ మీడియాలో వారు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.

కొత్త కొత్త సిద్ధాంతాల్ని తెర మీదకు తీసుకొచ్చి.. ఆ ఒక్కరోజు యావత్ దేశం ఇంట్లో నుంచి బయటకు రాకపోవటం వల్ల జరిగే ప్రయోజనం ఎంతన్న విషయాన్ని సైంటిఫిక్ గా చెప్పినట్లు చెప్పి.. చేసిన కామెడీ అంతా ఇంతా కాదు. చివరకు మోడీ ప్రకటించిన రోజులోని గొప్పతనాన్ని వివరించేందుకు వారు అల్లిన కథలు చూస్తే.. మోడీ వీరాభిమానుల్లో ఇంత చక్కటి కథకులు ఉన్నారా? అన్న విస్మయం వ్యక్తమైంది.

తమకు ఏ మాత్రం అవకాశం లభించినా.. మోడీ ఇమేజ్ ను ఎక్కడికో తీసుకెళ్లాలన్న తలంపు వారిలో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంటుంది. తాజాగా అయోధ్యలో రామాలయ భూమిపూజ సందర్భంగా మరోసారి చెలరేగిపోయారు. ఇందులో భాగంగా న్యూయార్క లోని ప్రఖ్యాత టైమ్ స్క్రైర్ వద్ద ఉండే బిల్ బోర్డులో రామాలయ భూమిపూజను లైవ్ లో టెలికాస్టు చేస్తున్నట్లుగా ప్రచారం చేశారు.

అంతలోనే.. టైమ్ స్వ్రైర్ మొత్తం రాముడి బొమ్మలతో హడావుడి చేసినట్లుగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇందులో నిజం ఎంత? అన్నది చూస్తే.. మోడీ సానుభూతిపరుల చేష్టలు మరోసారి కళ్లకు కట్టినట్లుగా అర్థం కాక మానవు. టైమ్ స్వైర్ వద్ద ప్రదర్శించిన అయోధ్య రామాలయం.. దానికి భారత జాతీయ పతాకం డిస్ ప్లే చేస్తూ.. అదంతా కూడా కమర్షిల్ వ్యవహారంగా చెప్పొచ్చు. మనం కానీ.. ఇంత సమయానికి ఇన్ని డబ్బులు ఇస్తాం.. మేం ఇచ్చిన సమాచారాన్ని డిస్ ప్లై చేయాలంటే కాస్త చెక్ చేసి చేస్తారు. దీనికి ప్రత్యేకమంటూఏమీ ఉండదు. డబ్బులే ప్రాతిపదిక.

ఇక.. టైమ్ స్వైర్ వద్ద ఉన్న చాలా బిల్ బోర్డుల్లో రామాలయానికి సంబంధించినడిస్ ప్లై చేసినట్లుగాకొన్ని ఫోటోలు బయటకువచ్చాయి. అవన్నీ కూడా ఫోటో షాప్ లో సెట్ చేసినవే తప్పించి.. ఒరిజినల్ కాదని చెబుతున్నారు. ఇలాంటి ప్రచారాల వల్ల అసలు ఘనతలు పక్కకు వెళ్లటమే కాదు.. నిజంగానే మోడీ సాధించిన వాటిని కీర్తించటానికి బదులు.. సందేహంగా చూడాల్సి పరిస్థితి ఏర్పడుతుందన్నది మర్చిపోకూడదు.