Begin typing your search above and press return to search.

తెలంగాణ‌కు పెట్టుబ‌డులు.. దావోస్‌లో కేసీఆర్ స‌క్సెస్

By:  Tupaki Desk   |   26 May 2022 1:30 AM GMT
తెలంగాణ‌కు పెట్టుబ‌డులు.. దావోస్‌లో కేసీఆర్ స‌క్సెస్
X
తెలంగాణలో నూతనంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు స్టాడ్లర్ రైల్ ముందుకొచ్చింది. దావో స్లో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశం అవుతున్నారు. అంతర్జాతీ య స్థాయి ప్రమాణాలతో స్టాడ్లర్ రైల్ అనే సంస్థ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. మరోవైపు రాష్ట్రంలో మరో తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు ష్నైడర్ ఎలక్ట్రిక్ కంపెనీ సిద్ధమైంది.

వెయ్యి కోట్ల పెట్టుబ‌డితో..

తెలంగాణలో అంతర్జాతీయ సంస్థ వెయ్యికోట్లు పెట్టుబడి పెట్టనుంది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాల తో స్టాడ్లర్ రైల్ అనే సంస్థ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. దావోస్లో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశం అవుతున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో నూతనంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు స్టాడ్లర్ రైల్ ముందుకొచ్చింది.

రాష్ట్రంలో ఉన్న మేదో సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్, స్టాడ్లర్ రైల్ కలిసి ఈ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని స్థాపించను న్నాయి. ఈ మేరకు స్టాడ్లర్ రైల్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు అన్స్గార్డ్ బ్రోక్ మెయ్, తెలంగాణ పరిశ్రమ ల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్లు దావోస్లోని తెలంగాణ పెవిలియన్లో అవగాహన ఒప్పం దంపై మంత్రి కేటీఆర్ సమక్షంలో సంతకాలు చేశారు.

రానున్న రెండు సంవత్సరాల్లో తెలంగాణలో వెయ్యి కోట్ల రూపాయలను రైల్వే కోచ్ ఫ్యాక్టరీ స్థాపన కోసం కంపెనీ పెట్టుబడిగా పెట్టనుంది. ఈ కంపెనీ ఫ్యాక్టరీ స్థాపన తర్వాత తయారుచేసే రైల్వే కోచ్లను కేవలం భారతదేశం కోసం మాత్రమే కాకుండా ఏషియా పసిఫిక్ రీజియన్లకు సైతం ఎగుమతి చేయనున్నట్లు తెలిపింది. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ముందుకు వచ్చిన స్టాడ్లర్ రైల్ కంపెనీకి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

కంపెనీ పెడుతున్న వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడి ద్వారా 2,500 మందికి ఉద్యోగ అవకాశాలు రాను న్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్న తమ యూనిట్ అత్యంత ప్రాధాన్యత కలిగినదిగా మారబోతుందని..కంపెనీ కార్యనిర్వాహక అధ్యక్షులు అన్స్గార్డ్ బ్రోక్ మెయ్ తెలిపారు. తమ కంపెనీ ఏషియా పసిఫిక్ ప్రాంతంలో అభివృద్ధిని సాధించేందుకు ఈ పెట్టుబడి దోహదపడుతుందన్నారు.

రాష్ట్రంలో మరో తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు ష్నైడర్ ఎలక్ట్రిక్ కంపెనీ సిద్ధమైంది. దావోస్‌లో మంత్రి కేటీఆర్‌తో చర్చించి ష్నైడర్‌ కంపెనీ ప్రతినిధి ఈ విషయాన్ని ప్రకటించారు. కంపెనీ విస్తరణ ప్రణాళికలపై మంత్రి కేటీఆర్‌తో ష్నైడర్‌ కంపెనీ చర్చలు జరిపి.. ప్రపంచస్థాయి ప్రమాణాలతో రెండో యూనిట్ చేస్తామని ప్రకటన విడుదల చేసింది.